Srisailam : శ్రీశైలంలో శివ భక్తుల గోస..గ్రామోత్సవం రద్దు!

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ భక్తుల గోస కొనసాగుతోంది. భారీ రద్దీ కారణంగా స్వామి, అమ్మవారి గ్రామోత్సవాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు.

Srisailam

అమరావతి : ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శివయ్య దర్శనం కోసం వెళ్లిన భక్తులు సరైన వసతుల కొరత, దర్శనం కోసం తిప్పలు పడుతున్నారు.శివ దీక్ష భక్తులకు స్పర్ప దర్శనం సక్రమంగా కల్పించడంలో విఫమైన అధికార యంత్రాంగంపై శివ స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 22 ఏళ్లుగా వస్తున్నాం, 4–5 గంటల్లో దర్శనం అయిపోయేది.. రాత్రి 12 గంటల నుంచి క్యూలైన్‌లో ఉన్నాం, కనీసం మంచి నీళ్లు కూడా అందించలేదని స్వాములు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో, చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నిరసనలకు సైతం దిగారు.

మంత్రులు వస్తున్నారని గంటలు గంటలు.. భక్తులని దర్శనానికి పంపకుండా ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేసిన భక్తులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొన్ని సందర్బాల్లో శివ భక్తులను నియత్రించేందుకు పోలీసుల లాఠీచార్జ్‌ చేయడం నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఈవో శ్రీనివాసరావుతో వాదనకు దిగారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి అధికారులకు మార్గదర్శకం చేశారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఢిల్లీ నుంచే శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎదురవుతున్న సమస్యలపై స్పందించి, ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసి సూచనలు జారీ చేశారు.

శ్రీశైలంలో భక్తుల రద్దీతో గ్రామోత్సవం రద్దు

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా సోమవారం జరగాల్సిన స్వామి, అమ్మవారి గ్రామోత్సవం రద్దయ్యింది. క్యూలైన్లలో వేలాది మంది ఉండటంతో ఉత్సవమూర్తులు రాజగోపురం బయటకు వెళ్లలేకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే అర్చకులు పూజలు నిర్వహించారు. అలాగే ద్వారకా తిరుమల ఆలయం నుంచి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలు కూడా సమర్పించలేదు. గ్రామోత్సవం జరగకపోవడం, పట్టు వస్త్రాలు సమర్పించకపోవడం మహా అపచారమని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీశైల ఆలయ చరిత్రలో మొదటిసారిగా స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం, అమ్మ వార్లకు నిర్వహించాల్సిన వాహనసేవ, గ్రామోత్సవం రద్దు చేశారంగూ మండిపడ్డారు. గ్రామోత్సవాన్ని ఆలయ ప్రాంతానికే పరిమితం చేయడం అధికారుల వైఫల్యమేనని భక్తులు విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి :

Namrata | వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. న‌మ్ర‌త షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌కి అదిరిపోయే రెస్పాన్స్
Allu Arjun | పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్… రెమ్యునరేషన్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న ‘ఐకాన్ స్టార్’

Latest News