Namrata | వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. న‌మ్ర‌త షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌కి అదిరిపోయే రెస్పాన్స్

Namrata | టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే జంట మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచారు.

  • By: sn |    movies |    Published on : Feb 10, 2026 4:40 PM IST
Namrata | వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. న‌మ్ర‌త షేర్ చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌కి అదిరిపోయే రెస్పాన్స్

Namrata | టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే జంట మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్‌. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఎన్నో జంటలకు ఆదర్శంగా నిలిచారు. ఇవాళ్టితో వారి వివాహ బంధానికి 21 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక సందర్భంగా నమ్రత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో, క్యాప్షన్ వైరల్ అవుతున్నాయి. “Still choosing you… everyday” అంటూ మహేష్ బాబుపై తన ప్రేమను వ్యక్తపరిచింది. కాలం మారినా భావాలు మాత్రం అలాగే నిలిచిపోయాయని ఈ పోస్ట్ మరోసారి రుజువు చేసింది. స్టార్‌డమ్, గ్లామర్, కెరీర్ ఒత్తిళ్ల మధ్య కూడా ఒక బంధాన్ని ఇంత అందంగా నిలబెట్టుకోవడం ఈ జంట ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

మిస్ ఇండియా విజేతగా గుర్తింపు పొందిన నమ్రత, హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే మహేష్ బాబుతో పరిచయం ఏర్పడింది. ‘వంశీ’ సినిమా సమయంలో మొదలైన స్నేహం ప్రేమగా మారి, 2005 ఫిబ్రవరి 10న పెళ్లి బంధంగా మారింది. పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చారు. మహేష్ కెరీర్‌లో కీలక దశల్లో భార్యగా పూర్తి మద్దతుగా నిలిచారు.

ఈ దంపతులకు గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్ విదేశాల్లో చదువుకుంటుండగా, సితార భారత్‌లో చదువుతో పాటు ప్రకటనల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు మహేష్ బాబు ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఇంట్లో మాత్రం సాధారణ భర్త, తండ్రిగా ఉంటారని ఆయన గురించి తరచూ వినిపించే మాట.

ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లు, క్వాలిటీ టైమ్ గడపడం మహేష్‌కు అలవాటు. 21 ఏళ్ల ఈ ప్రయాణంలో ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన వారి బంధాన్ని మరింత బలపరిచాయి. అందుకే మహేష్–నమ్రత జంట కేవలం సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు, లక్షలాది అభిమానులకు రిలేషన్‌షిప్ గోల్స్‌గా నిలిచింది. యానివ‌ర్స‌రీ సంద‌ర్భంగా ఈ జంట‌కి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.