Allu Arjun | ‘పుష్ప 2’ విజయంతో దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, నిజమైన నేషనల్ స్టార్‌గా ఎదిగారు. కెరీర్ ప్రారంభంలో స్టైలిష్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన డ్యాన్స్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రతి సినిమాతో మెరుగుపరుచుకుంటూ స్థిరమైన మార్కెట్‌ను నిర్మించుకున్నారు. ‘ఆర్య’, ‘రేసుగుర్రం’, ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన అల్లు అర్జున్, ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఆయనకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.
దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచి, “నేషనల్ స్టార్” అనే ట్యాగ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన మార్కెట్ మరింత విస్తరించనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవొచ్చని ఇండస్ట్రీ టాక్.
అయితే అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాల ఎంపికతో పాటు రెమ్యునరేషన్ విషయంలో కూడా కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ పారితోషిక విధానానికి భిన్నంగా, సినిమా మొత్తం బిజినెస్‌పై పర్సంటేజ్ రూపంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఆయన ప్రత్యేకతగా మారింది. ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.1000 కోట్లకు చేరుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అందులో సుమారు 27 శాతం వరకు అల్లు అర్జున్ వాటాగా అందుకున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అంటే దాదాపు రూ.250–270 కోట్ల మధ్య ఆయనకు రెమ్యునరేషన్ లభించిందనే చర్చలు సాగాయి. విడుదల తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవడం కంటే ముందుగానే బిజినెస్‌పై పర్సంటేజ్‌గా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రిస్క్ తగ్గుతుందని ఆయన ఆలోచనగా చెప్పుకుంటున్నారు.
అట్లీ–సన్ పిక్చర్స్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ఈ పర్సంటేజ్ మోడల్ మరింత పెరిగిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈసారి 27 శాతం నుంచి 30 శాతం వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాణ సంస్థ అంగీకరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, అల్లు అర్జున్‌కు రూ.300 కోట్లకు పైగానే పారితోషికం అందే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కీలక ఆర్థిక చర్చలన్నీ అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడైన బన్నీ వాసు పర్యవేక్షణలోనే జరిగాయని సమాచారం. మార్కెట్ పరిస్థితులు, లాంగ్ టర్మ్ ప్లానింగ్, బ్రాండ్ విలువ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అల్లు అర్జున్‌ను కేవలం నటుడిగానే కాకుండా ఒక శక్తివంతమైన బ్రాండ్‌గా నిలబెడుతున్నాయి.
