Raaka | ‘రాకా’తో కొత్త ప్రపంచంలోకి అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ చేస్తున్నది ఇండియన్ సినిమా చరిత్రేనా?

Raaka | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై సినీ వర్గాల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌, వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుందనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

  • By: Sandeep |    movies |    Published on : May 14, 2026 4:15 PM IST
Raaka | ‘రాకా’తో కొత్త ప్రపంచంలోకి అల్లు అర్జున్.. అట్లీ ప్లాన్ చేస్తున్నది ఇండియన్ సినిమా చరిత్రేనా?

Raaka | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’పై సినీ వర్గాల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌, వినూత్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్తుందనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో రూపొందుతున్నట్లు సమాచారం. దీంతో ఇది అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా నిలవబోతోంది. ఇప్పటివరకు ఆయన చేసిన మాస్ పాత్రలు ఒక ఎత్తైతే, ‘రాకా’లో కనిపించబోయే క్యారెక్టర్ మరో ఎత్తు అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

హాలీవుడ్ సినిమాల‌కి పోటీగా..

ఈ సినిమా ప్రధానంగా ‘సమాంతర ప్రపంచం’ అనే సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతోంది. ప్యారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండబోతున్నాయని సమాచారం. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అట్లీ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారని టాక్.

అట్లీ ఇప్పటివరకు తెరకెక్కించిన చిత్రాల్లో మాస్ ఎలిమెంట్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు అదే మాస్ టచ్‌కు సైన్స్ ఫిక్షన్ ఫ్లేవర్ జోడించి, ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రయోగాత్మక కథాంశంతో పాటు కమర్షియల్ అంశాలను సమతూకంగా మిళితం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

రికార్డుల వేట‌..

ప్రస్తుతం అభిమానులంతా ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ విడుదలైతే సోషల్ మీడియా షేక్ అవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అల్లు అర్జున్ స్టైల్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌, అట్లీ మాస్ ట్రీట్‌మెంట్ కలిసి వస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నమోదవుతాయని అభిమానులు నమ్ముతున్నారు.

ఇక ఈ చిత్రం కేవలం భారతీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, గ్లోబల్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, భారీ విజువల్ డిజైన్‌, ప్రత్యేక యాక్షన్ సెటప్‌తో ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిన నేపథ్యంలో ‘రాకా’పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త ప్రపంచం, కొత్త కాన్సెప్ట్‌, కొత్త అవతారంలో ఐకాన్ స్టార్ కనిపించబోతుండటంతో ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ సినిమా అభిమానుల దృష్టిని పూర్తిగా ఆకర్షిస్తోంది.