విధాత : ‘కాంతార’(Kantara)పై సినిమాకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యల(comments controversy) పై కన్నడిగులు, హిందు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్( Ranveer Singh apology) క్షమాపణలు తెలిపారు. నా వ్యాఖ్యల ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇటీవల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ ‘కాంతార’పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
రిషబ్ శెట్టి అద్భుతంగా(Rishab Shetty performance) నటించారన్న రణ్‌వీర్.. ‘హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సన్నివేశాలు చాలా బాగున్నాయని అభినందించారు. ఈ క్రమంలో కాంతారలో ఎంతో వైరలైన పందార దేవుడి ఆగమనంకు సంబంధించిన భూతో కోల ‘ఓ..’ అనే శబ్దాన్నివేదికపై రణవీర్ చేసి చూపారు. అయితే దానిని రణవీర్ హాస్యాస్పద పద్ధతిలో చేయడం పట్ల కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ జనజాగృతి సమితి ఆయనపై ఫిర్యాదు సైతం చేసింది. వెంటనే రణబీర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో రణ్‌వీర్ క్షమాపణలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.
‘కాంతార’ మూవీలో రిషబ్ శెట్టి చాలా బాగా నటించారని చెప్పడం కోసం నేను అలా వేదికపై నటించి చూపానని.. ఆ సన్నివేశాల్లో నటించడం ఎంత కష్టమో నాకు తెలుసు అని రణవీర్ వివరణ ఇచ్చారు. ఎంతో కష్టమైన సన్నివేశాల్లోనూ అద్భుతంగా చేయగలరు కాబట్టే రిషబ్ అంటే చాలా ఇష్టం. మన దేశంలోని ప్రతి సంప్రదాయం మీద నాకు గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అని రణవీర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
