హైదరాబాద్: హిందూ దేవతల పట్లు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసు కేసు నమోదైంది. నటి కరాటే కల్యాణి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను కించపరుస్తూ వివాదాస్పద కంటెంట్ ప్రచారం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు BNS సెక్షన్స్ 352, 79, 299, 67 IT చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అన్వేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.‘నా అన్వేషణ’ పేరుతో అన్వేష్ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలపై స్పందించే క్రమంలో అన్వేష్ హిందూ దేవతలను, ప్రవచన కర్తలను కించపరుస్తూ విమర్శలు చేయడం వివాదస్పమైంది. హిందూ సంఘాలు అన్వేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. ఇప్పటికే అన్వేష్ ఫాలోవర్స్ లక్షల సంఖ్యలో అన్ ఫాలో చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Muslim Woman Dance In Old City : పాతబస్తీ వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మైనార్టీ మహిళా డాన్స్ వైరల్
Gold, Silver Price| తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
