Tarun Bhaskar | టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం… ఇష్యూ హాట్ టాపిక్

Tarun Bhaskar | సెలబ్రిటీలూ–జర్నలిస్టుల మధ్య అప్పుడప్పుడు జరిగే మాటల తూటాలు పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఒక సీనియర్ జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది.

Tarun Bhaskar | సెలబ్రిటీలూ–జర్నలిస్టుల మధ్య అప్పుడప్పుడు జరిగే మాటల తూటాలు పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఒక సీనియర్ జర్నలిస్టుతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. గతంలో కూడా వీరిద్దరి మధ్య మాటల దాడులు జరిగిన నేపథ్యంలో, ఈ సంఘటనపై నెటిజన్లు మరింత దృష్టి సారించారు.

తరుణ్ కామెంట్‌తో ..

ఈవెంట్‌లో భాగంగా ప్రశ్నించడానికి జర్నలిస్ట్ మైక్ తీసుకునే సరికి, తరుణ్ భాస్కర్ మధ్యలోనే “హ్యాపీ క్రిస్మస్ సార్… అడ్వాన్స్ మెర్రీ క్రిస్మస్” అంటూ కామెంట్ చేయడంతో, జర్నలిస్ట్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. “నేను లేచి వెళ్ళిపోతాను సార్… ఇది చాలా బ్యాడ్ బిహేవియర్” అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆ స‌మ‌యంలో తరుణ్ ప్రవర్తన ఆయన కోపాన్ని మరింత రెచ్చగొట్టింది.

“మేం అనలేమా ప్లాప్ డైరెక్టర్ అని?” ..

గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ జర్నలిస్ట్, “లాస్ట్ టైమ్ మీరు చెప్పిన మాటల్ని పట్టుకుని అందరూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. మేం అనలేమా మిమ్మల్ని ప్లాప్ డైరెక్టర్, ప్లాప్ హీరో అని?” అంటూ తరుణ్‌ను ప్రశ్నించారు. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా ప్రవర్తించడం పూర్తిగా తప్పని ఆయన తరుణ్‌కే ఎదురు చెప్పేశారు.

తరుణ్ వివరణ.. కానీ సెటైరిక్ టోన్‌తోనే

దీనిపై తరుణ్ భాస్కర్ స్పందిస్తూ “సారీ సార్… ఐ యామ్ యాక్సెప్టింగ్… కాళ్లు మొక్కమంటారా?” అంటూ మళ్లీ సెటైరికల్‌గా మాట్లాడటం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. “నేను ఎప్పుడో అన్నాను… ఇప్పుడేమీ అనలేదే” అని చెప్పే ప్రయత్నించినా, జర్నలిస్ట్ ఆగ్రహం తగ్గలేదు.

చివరకు షేక్ హ్యాండ్‌తో సర్దుబాటు

జర్నలిస్ట్ కోపంతో బయటకు వెళ్లిపోవడానికి సిద్ధమైన సమయంలో, తరుణ్ భాస్కర్ ఆయన దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పరిస్థితిని కూల్ చేయాలని ప్రయత్నించారు. “మనం మనం మెసేజ్ చేసుకుందాం సార్… ఇది అంతా ఎందుకు” అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు జర్నలిస్ట్‌ వైపు నిలుస్తుండగా, మరికొందరు తరుణ్ భాస్కర్‌ సరదా కామెంట్‌ను పెద్దదిగా తీసుకోవడం అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాపై ప్రభావం?

ఈ వివాదంతో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్ లాంచ్ ఈవెంట్ హాట్ టాపిక్ అయింది. ఇక జనవరి 23న విడుదల కానున్న ఈ సినిమాపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకుడిగా బిజీ అవుతుండగా, ‘ఈ నగరానికి ఏమైంది 2’ షూట్‌కు సంబంధించిన అప్డేట్ త్వరలో ఇవ్వబోతున్నారు.

Latest News