Vijay Devarakonda |రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్న రా, మాస్, పవర్‌ఫుల్ పాత్రకు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లుగా ఉంది ‘రౌడీ జనార్ధన’ టైటిల్ గ్లింప్స్. దర్శకుడు రవికిరణ్ కోలా మాస్ పల్స్‌ను కచ్చితంగా పట్టుకున్నాడని ఈ చిన్న వీడియోతోనే స్పష్టమవుతోంది. లవర్ బాయ్ ఇమేజ్‌ను పూర్తిగా పక్కన పెట్టి, విజయ్ ఈసారి నెవ్వర్ బిఫోర్‌గా ఒక రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాడు. గ్లింప్స్ చూస్తుంటే ఇది కేవలం సినిమా కాదు, ఒక రౌడీ ప్రస్థానం అన్న ఫీలింగ్ క్లియర్‌గా వస్తోంది. వీడియో ఓపెనింగ్‌లోనే వినిపించే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ సినిమాకి టోన్ సెట్ చేస్తుంది. “గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? నేను చూసాను” అనే డైలాగ్‌తోనే గూస్‌బంప్స్ వస్తున్నాయి.
గట్టిగా కొట్టేలా ఉన్నాడుగా..
ఈ వాయిస్ ఓవర్ కథలోని డార్క్ ఇంటెన్సిటీని పెంచుతూ, హీరో పాత్ర ఎంత వైలెంట్‌గా ఉండబోతుందో హింట్ ఇస్తుంది. కత్తులతో చేసే విన్యాసాలు, మంటల మధ్య జరిగే పోరాటాలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాయి.విజయ్ దేవరకొండ మేకోవర్ అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒంటి నిండా రక్తం, చేతిలో కత్తి, కళ్లలో పగతో కనిపించే విజయ్ లుక్ నెవ్వర్ బిఫోర్ అనిపిస్తుంది. “కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నోడు…” అనే డైలాగ్ హీరో క్యారెక్టర్ డెప్త్‌ని, అతని లోపలి కోపాన్ని పర్ఫెక్ట్‌గా వర్ణిస్తోంది. విజయ్ డైలాగ్ డెలివరీ నేచురల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండి క్యారెక్టర్‌కు మరింత బలం చేకూర్చింది.
గ్లింప్స్‌లో మరో పెద్ద హైలైట్ మ్యూజిక్. క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఫ్రేమ్‌కు ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల్లో వచ్చే సౌండ్ డిజైన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. ఆనంద్ సి చంద్రన్ సినిమాటోగ్రఫీ రూరల్ అట్మాస్ఫియర్‌ను, డార్క్ మూడ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు కూడా గ్లింప్స్ మొత్తం రిచ్‌గా కనిపిస్తూ సినిమాపై నమ్మకం పెంచుతున్నాయి. “కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు… జనార్ధన… రౌడీ జనార్ధన” అంటూ టైటిల్‌ను రివీల్ చేసిన విధానం అదిరిపోయింది. ఒక సాధారణ వ్యక్తి ఎలా ‘రౌడీ’గా మారాడు? ఆ పేరు వెనుక దాగి ఉన్న పెయిన్, వయోలెన్స్ ఏంటి? అన్నదే ఈ సినిమా కథ అని గ్లింప్స్‌తోనే అర్థమవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.మొత్తంగా ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్ చూస్తే విజయ్ దేవరకొండ ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే సౌండ్ చేయబోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
