Shah Rukh Khan And Kajol : లండన్ లో షారుఖ్-కాజోల్ జంట కాంస్య విగ్రహావిష్కరణ

డీడీఎల్‌జే 30వ వార్షికోత్సవం సందర్భంగా లండన్‌లో షారుఖ్–కాజోల్ జంట కాంస్య విగ్రహం ఆవిష్కరణ. భారతీయ సినిమాకు లభించిన అరుదైన గౌరవంగా విశ్లేషకుల అభిప్రాయం.

విధాత : బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే(DDJL) 30వ వార్షికోత్సవం పురస్కరించుకుని లండన్ లోని లీసెస్టర్ స్క్వేర్‌లో మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన షారుఖ్ ఖాన్-కాజోల్ ల జంట కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మూవీలోని వారి ఐకానిక్ భంగిమలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిర్వాహకులు వారిచేతనే ఆవిష్కరింప చేయించడం విశేషం. ఇది భారతీయ సినిమాకు లభించిన అరుదైన గౌరవంగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆదిత్యచోప్రా దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం దిల్‌వాలే దుల్హానియాలేజాయెంగే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ సినిమాలు షారుఖ్ రాజ్ మల్హోత్రా పాత్రలో, కాజోల్ సిమ్రాన్ పాత్రలో తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. 1995అక్టోబర్ 25న విడులైన ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో థియేటర్లలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డు నెలకొల్పింది. ముంబయిలోని మరాఠా మందిర్‌లో స్వల్ప విరామాల మధ్య ఏకంగా 27 ఏళ్ల పాటు ప్రదర్శించబడింది. ఆ రోజుల్లో రూ.4 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ‘బెస్ట్‌ పాపులర్‌ ఫిల్మ్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ విభాగంలో జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది.
అమెరికన్‌ ప్రొడ్యూసర్‌, క్రిటిక్‌ స్టీవెన్‌ రాసిన ‘1001 మూవీస్‌ యూ మస్ట్‌ సీ బిఫోర్‌ యూ డై’ పుస్తకంలో ఈ చిత్రం చోటు దక్కించుకోవడం విశేషం. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేలో మొత్తం 7 పాటలు ఉన్నాయి. ఈ పాటలను సంగీతకారులు జతిన్-లలిత్ స్వరపరిచారు. తుజా దేకా తోయే జానా సనమ్.. సహా దాదాపు అన్ని పాటలు ఆకట్టుకోవడంతో సినిమా మ్యూజికల్ హిట్ గా కూడా నిలిచింది.

 

ఇవి కూడా చదవండి :

Punarnavi Bhupalam | ఎట్ట‌కేల‌కి కాబోయే వ‌రుడిని ప‌రిచ‌యం చేసిన అందాల ముద్దుగుమ్మ‌.. పెళ్లెప్పుడో మ‌రి..!
Tirumala : తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ కలకలం

Latest News