అమరాతి : తిరుమలలో మరోసారి డ్రోన్ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద డ్రోన్ ఎగరేసి…పరిసరాలను చిత్రీకరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపైన, కొండలపైన ఎలాంటి డ్రోన్ లు, వస్తువులు ఎగరకూడదనే నిబంధన ఉంది. ఈ క్రమంలో శుక్రవారం శిలాతోరణం వద్ద ఓ డ్రోన్ ఎగురుతుండడాన్ని గుర్తించిన స్థానిక భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ అధికారులు డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం అతడిని పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. తిరుమలలో మూడంచెల భద్రతను దాటుకొని ఆ ఎన్నారై భక్తుడు డ్రోన్ కెమెరాతో కొండకుపైకి చేరుకోవడం నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని ప్రశ్నార్ధకం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం దాటి వచ్చి తిరుమలలోని శిలాతోరణం వద్ద భక్తులు, భద్రతా సిబ్బంది ఉండగానే విదేశీ భక్తుడు డ్రోన్ ఎగురవేశాడు.
ఇవి కూడా చదవండి :
KTR Vs Ponguleti : హిల్ట్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్
DGCA : దిగొచ్చిన డీజీసీఏ..ఆంక్షల ఎత్తివేత
