OTT this week | ఓటీటీలో ఈ వారం మూవీస్ – అన్నీ యూత్​ సినిమాలే

ఈ వారం ఓటీటీల్లో తెలుగు హిట్ మూవీస్ వరుసగా.. కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’, ‘ఢిల్లీ క్రైమ్ 3’, ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ స్ట్రీమింగ్​కు సిద్ధం. నవంబర్ 10–16 రిలీజ్ లిస్ట్ ఇదే...

ఈ వారం ఓటీటీలో హిట్ మూవీస్, సిరీస్​లు

This Week OTT Releases: Telugu Hits, Web Series, and Global Premieres Streaming Now

థియేటర్లలో ‘కాంత’, ‘సంతాన ప్రాప్తిరస్తూ’, ‘శివ’ రీ రిలీజ్‌తో బాక్సాఫీస్ సందడి కొనసాగుతుండగా, మరోవైపు ఓటీటీ వేదికలపై ఈ వారం కూడా సినిమాల వర్షం కురుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ, తమిళ భాషల్లో పలు సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నవంబర్ 10 నుంచి 16 వరకు వరుసగా స్ట్రీమింగ్​కు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి రానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా తెలుగు హిట్ మూవీస్

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమాలు తెలుసు కదా, డ్యూడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. నవంబర్ 14న స్ట్రీమింగ్‌కు రానున్న ఈ సినిమాలు ఇటీవల థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఇవి కాకుండా అంతర్జాతీయ సిరీస్‌లు, చిత్రాలు కూడా ఈ వారం అందుబాటులోకి వస్తున్నాయి:

ఆహా, హాట్‌స్టార్, జీ5లో కొత్త డబ్బింగ్ సినిమాలు

తెలుగు ప్రేక్షకుల కోసం ఆహా ఓటీటీ మరోసారి సరికొత్త సినిమాతో ముందుకొస్తోంది.

హాట్‌స్టార్‌లో

జీ5లో

అదే రోజున మనోరమా మ్యాక్స్‌లో కప్లింగ్ (మలయాళ సిరీస్), సింప్లీ సౌత్‌లో పొయ్యమొళి, యోలో సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతాయి. అదనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్లే డేట్ నవంబర్ 12న విడుదల కానుంది.

సినిమా థియేటర్లు బిజీగా ఉన్నా, ఓటీటీ వేదికల ఆకర్షణ తగ్గడం లేదు. నవంబర్ రెండో వారం ప్రేక్షకులకు భాషలు దాటే వినోద పండగగా మారబోతోంది. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ‘కె ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ సినిమాలు, అలాగే ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 3’ వంటి సిరీస్‌లు తప్పక చూడదగినవి.