Alcohol | మీరు మద్యం తాగుతారా.. ఆ సమయంలో ఇవి మాత్రం తినకండి

Alcohol | విధాత: మద్యపానం ఆరోగ్యానికి హానికరం! తాగే బాటిల్‌పై ఈ హెచ్చరిక ఉంటుంది. అయినా మద్యానికి అలవాటుపడినవారు ఈ హెచ్చరికను పట్టించుకోరు. వీలు చిక్కినప్పుడల్లా పెగ్గు మీద పెగ్గు కొట్టు.. అంటూ మందేస్తుంటారు. సిప్పు సిప్పు మధ్యలో మంచింగ్‌ పేరుతో చికెన్‌ ముక్కలో, పల్లీలో, వేపుళ్లో నోట్లో పడేస్తుంటారు. అయితే.. మద్యం తాగేటప్పుడు కొన్నింటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగటమే డేంజర్‌ అయితే.. మద్యంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మరింత […]

  • Publish Date - May 23, 2023 / 10:08 AM IST

Alcohol |

విధాత: మద్యపానం ఆరోగ్యానికి హానికరం! తాగే బాటిల్‌పై ఈ హెచ్చరిక ఉంటుంది. అయినా మద్యానికి అలవాటుపడినవారు ఈ హెచ్చరికను పట్టించుకోరు. వీలు చిక్కినప్పుడల్లా పెగ్గు మీద పెగ్గు కొట్టు.. అంటూ మందేస్తుంటారు.

సిప్పు సిప్పు మధ్యలో మంచింగ్‌ పేరుతో చికెన్‌ ముక్కలో, పల్లీలో, వేపుళ్లో నోట్లో పడేస్తుంటారు. అయితే.. మద్యం తాగేటప్పుడు కొన్నింటిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగటమే డేంజర్‌ అయితే.. మద్యంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం మరింత డేంజర్‌ అని బెల్స్‌ మోగిస్తున్నారు.

ఊళ్లో నలుగురు ఫ్రెండ్స్‌ చెట్టు నీడలో కూర్చొని మందేసేటప్పుడు మంచింగ్‌కు ఏం తెచ్చుకోవాలని డిస్కస్‌ చేస్తుంటారు. అందులో చికెన్‌, చిప్స్‌, వేపుడు ఇలా ఏదో ఒకటి మస్ట్‌గా ఉంటుంది. అయితే.. నాన్‌వెజ్‌తో మద్యపానం చేస్తే.. ఆకలి బాగా పెరిగిపోతుందట. ఎందుకంటే నాన్‌వెజ్‌లో ఉప్పు, కారం ఆకలిని పెంచేస్తాయి. అందుకే జాగ్రత్తలు సూచిస్తున్నారు నిపుణులు.

పిజ్జాతో ముప్పు

సిప్‌ చేసే సమయంలో పిజ్జా ముక్క కొరికితే ఆ మజానే వేరనిపిస్తుంది.. కానీ.. అది మాత్రం చాలా డేంజర్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌కు, పిజ్జాకు పొసగదని అంటున్నారు. మద్యం తాగుతూ పిజ్జా తినడం వల్ల అది సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా పొట్ట నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.

కాయ ధాన్యాలు, బీన్స్‌

కాయ ధాన్యాలు, బీన్స్‌ వంటి వాటిలో ఐరన్‌ మోతాదు ఎక్కువ ఉంటుంది. ఇవి ఆల్కహాల్‌తో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మద్యం, బీన్స్‌ కలయిక పేగులపై దుష్ప్రభావాలు చూపిస్తుంది. అజీర్తికి కూడా అవకాశాలు ఉంటాయి.

ఉప్పుకారాలు దట్టించిన ఆహారాలు

పకోడీ, వేపుళ్లు వంటివి పక్కనుంటే ఆ కిక్కే వేరు అనుకుంటున్నారా? అది కూడా డేంజరేనండీ! ఉప్పుకారాలు బాగా దట్టించిన ఆహార పదార్థాల్లో సోడియం స్థాయి ఎక్కువ ఉంటుంది. దీని వలన పొట్ట సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది.

డెయిరీ ఉత్పత్తులతోనూ రిస్కే

మద్యం తాగడానికి ముందు లేదా తర్వాత చీజ్‌, మిల్క్‌, ఐస్‌క్రీం వంటి డెయిరీ ఉత్పత్తులు ముట్టుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కనిపించకుండానే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. మలబద్ధకానికి కూడా దారి తీస్తుంది.

స్పైసీ ఫుడ్స్‌

స్పైసీ ఫుడ్స్‌తోనూ ఇబ్బందే. అవి కూడా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. స్పైసీ ఆహారాలు కడుపు నుంచి వెళ్లటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఫలితంగా పొట్టలో గ్యాస్‌ తయారవుతుంది. అజీర్తి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.

చాక్లెట్స్‌ తినొచ్చా?

మద్యం తాగేటప్పుడు సరదాగా చాక్లెట్స్‌ లాగించేవారూ ఉంటారు. అది కూడా వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే కెఫిన్‌, కోకా.. ఈ రెండూ చాక్లెట్స్‌లో ఉంటాయి. మద్యంతోపాటు ఇవి తీసుకుంటే పేగు సంబంధ ఇబ్బందులు పెరుగుతాయి. అంతేకాదు.. బాగా ఆకలి వేసి.. ఎక్కువగా తినాలనిపిస్తుంది.. అది మళ్లీ జీర్ణ సమస్యలకే దారి తీస్తుంది.

Latest News