Health Tips | మీలో నెలసరి సక్రమంగా లేదా.. అయితే తరచూ ఈ పండు తినండి..!

Health Tips : ప్రతి జీవికి ప్రకృతి అమూల్యమైన పండ్లను ప్రసాదిస్తున్నది. ప్రకృతి ప్రసాదించే ఈ అన్ని రకాల పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. దాదాపు అన్ని పండ్లకు రోగనిరోధ‌క శ‌క్తిని పెంచే ల‌క్షణం కూడా ఉంటుంది. ఈ పండ్లలో కొన్నింటిని స‌లాడ్‌ల రూపంలోగానీ, జ్యూస్ రూపంలోగానీ తీసుకోవ‌డం ద్వారా మ‌నం ఎదుర్కొంటున్న ఎన్నో అనారోగ్య స‌మ‌స్యల‌కు చక్కని ప‌రిష్కారం ల‌భిస్తుంది. అలాంటి వాటిలో అనాస పండు (Pine apple) కూడా ఒకటి. ఈ పైనాపిల్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Publish Date - May 25, 2024 / 10:00 PM IST

ప్రయోజనాలు..

1. పైనాపిల్ జ్యూస్ తాగ‌డం ద్వారా వాతం త‌గ్గుతుంది. కఫం నుంచి ఉపశమనం ల‌భిస్తుంది.

2. అప్పుడప్పుడూ పైనాపిల్ తిన‌డంవ‌ల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ర‌క్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.

౩. అనాస పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకానికి మంచి మందుగా పనిచేస్తుంది.

4. బాగా పండిన అనాస పండు తిన‌డం ద్వారా పంటి చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం త‌గ్గుతుంది.

5. దోరగా పండిన అనాస పండు రసం తాగ‌డం ద్వారా కడుపులో నులి పురుగులు చచ్చిపోతాయి.

6. జ్వరం, కామెర్లు వంటి అనారోగ్యాలతో ఉన్నవారికి అనాస రసం ఇవ్వడంవ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది.

7. తురచూ అనాసను తీసుకుంటే వాపులు, నాసికా సంబంధమైన వ్యాధులు, టైఫాయిడ్ నుంచి ఉపశమనం ల‌భిస్తుంది.

8. ఆడవారిలో చాలామంది నెలసరి క్రమం తప్పడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. తరచూ పైనాపిల్‌ తీసుకోవడం ద్వారా హార్మోన్‌ల అసమతుల్యత తగ్గి నెలసరి సక్రమంగా వస్తుంది.

9. పైనాపిల్‌ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా తోడ్పడుతుంది. తరచూ అనాస పండు రసంతో ముఖానికి మ‌ర్దన చేసుకుంటే చర్మం కోమలంగా మారుతుంది. అంతేగాక ముఖంపై నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి.

Latest News