Onion Hair Oil | జుట్టు రాలుతుందా..? ఉల్లిపాయ నూనెతో చెక్ పెట్టండిలా..!

Onion Hair Oil | మీ జుట్టు( Hair ) రాలుతుందా..? బ‌ట్ట‌త‌లతో బాధ‌ప‌డుతున్నారా..? అయితే చింతించాల్సిన అస‌వ‌రం లేనేలేదు. ఇంట్లోనే సుల‌భంగా త‌యారు చేసుకునే ఉల్లిపాయ నూనెతో జుట్టు రాలే స‌మ‌స్య‌కు చెక్ పెట్టొచ్చు. ఉల్లిపాయ నూన( Onion Hair Oil )ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Onion Hair Oil | స్త్రీ, పురుషులు ఎవ‌రైనా స‌రే.. జుట్టుకు( Hair ) అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు. అయితే ఒత్తిడి, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల కార‌ణంగా జుట్టు రాలిపోతోంది. ఇలాంటి వారు అనేక ర‌కాల నూనెల‌ను వాడుతారు. కానీ ఫ‌లితం ఉండ‌దు. ఉన్న జుట్టు కూడా రాలిపోతోంది. కానీ ఉల్లిపాయ నూనె( Onion Hair Oil )తో జుట్టును కాపాడుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

జుట్టుకు బ‌లం సల్ఫ‌ర్..

ఉల్లి చేసిన మేలు త‌ల్లి కూడా చేయ‌డ‌ద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. అయితే ఉల్లిపాయ‌ల్లో అధికంగా స‌ల్ఫ‌ర్ ఉంటుంది. ఈ సల్ఫ‌ర్ జ‌ట్టుకు బ‌లాన్ని ఇవ్వ‌డ‌మే కాకుండా, జుట్టును రాల‌కుండా చేస్తుంది. ఉల్లిపాయ‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా చుండ్రును నివారించ‌డంలో స‌హాయ‌ప‌డుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును తెల్ల‌బ‌డ‌కుండా ఉంచుతాయి. జ‌ట్టుకు స‌హ‌జ మెరుపును తీసుకువ‌స్తాయి.

మ‌రి ఉల్లిపాయ నూనెను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చా..?

జుట్టుకు ర‌క్ష‌ణ‌నిచ్చే ఉల్లిపాయ నూనెను ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చా..? అంటే చేసుకోవ‌చ్చు. ఉల్లిపాయ నూనె త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం కూడా. రెండు నుంచి మూడు ఉల్లిపాయ‌లు అవ‌స‌రం. 200 మి.లీ. కొబ్బ‌రి నూనెతో పాటు గుప్పెడు క‌రివేపాకు, టీ స్పూన్ మెంతులు సిద్ధం చేసుకోవాలి.

ఉల్లిపాయ నూనె త‌యారీ విధానం ఇలా..

రెండు నుంచి మూడు ఉల్లిపాయ‌ల‌ను చిన్న ముక్క‌లు ముక్క‌లుగా క‌ట్ చేయ‌గాలి. ఆ త‌ర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ త‌ర్వాత ఒక క‌డాయిలో కొబ్బ‌రి నూనె వేసి.. కాస్త వేడి చేయాలి. వేడెక్కిన కొబ్బ‌రి నూనెలో ఉల్లిపాయ పేస్ట్, క‌రివేపాకు, మెంతులు వేసి కాసేపు ఉడికించాలి.

ఎన్ని నిమిషాలు ఉడికించాలి?

ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా మంట మీద ఉంచి.. ఉల్లిపాయ పేస్ట్ ముదురు గోధుమ రంగులోకి మారే వరకు నిరంతరం కలపాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా జాగ్రత్త వహించండి. కేవలం దాని సారం నూనెలో బాగా కలిపేలా చూసుకోవాలి. దీనికి సుమారు 15-20 నిమిషాలు పట్టవచ్చు. నూనె చల్లారిన తర్వాత.. కాటన్ వస్త్రంతో వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

జుట్టుకు ఎలా అప్లై చేయాలంటే..

ఉల్లిపాయ నూనెను ఉపయోగించడానికి మొదట వేళ్ల కొనలతో తలపై చర్మానికి నెమ్మదిగా రాయండి. జుట్టు మూలాల వరకు నూనె చేరేలా కనీసం 10-15 నిమిషాల పాటు వృత్తాకార కదలికలో మసాజ్ చేయండి. తరువాత నూనెను కనీసం ఒక గంట పాటు జుట్టుకు పట్టించాలి. తరువాత తేలికపాటి లేదా సల్ఫేట్ లేని షాంపూతో మీ జుట్టును కడగాలి. ఉల్లిపాయ వాసనను తొలగించడానికి.. చివరగా నిమ్మరసం కలిపిన నీటితో కూడా మీ జుట్టును కడగవచ్చు.

Latest News