విధాత: తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరంలో జీవక్రియలన్నీ కూడా మందగిస్తాయి. భోజనం లేకుండా ఒక రోజంతా ఉండగలం కడుపునిండా నీళ్లు తాగి కానీ ఏన్ని తిన్నా నీళ్లు లేకుండా ఉండలేము. పనిలో పడి ఏ రోజైనా నీళ్లు తాగడం నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మెదుడు కూడా చురుకుగా పని చెయ్యదు, కళ్లు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. నీళ్లు లేకుండా కొన్ని గంటలు బతకడం కూడా కష్టమే. అలాంటిది రాత్రి నిద్రపోతే ఒక్కోసారి రాత్రంతా నీళ్లు తాగము మరి డీహైడ్రేట్ కాదా? అనే అనుమానం వస్తుంది. అందుకే నిద్ర లేచాక మొదటి డ్రింక్ వాటర్ మాత్రమే అని నిపుణులు సూచిస్తున్నారు.
ఒక రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఉదయాన్నే మొదటి తాగాల్సింది నీళ్లే. అయితే చాలామంది పళ్లుతోముకున్నాక నీళ్లు తాగుతారు. పళ్లుతోముకున్నాక తాగాలా లేక ముందుగానే తాగాలా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవాల్సిందే.
ముందుగానే మంచిది
ఉదయం మేల్కోన్న వెంటనే నీళ్ల తాగెయ్యొచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేసే అలవాటు. రాత్రంతా పదేపదే నీళ్లు తాగడానికి కుదరదు. అందువల్ల శరీరం కాస్త డీహైడ్రేట్ అవుతుంది. అందుకే లేవగానే నీళ్లు తాగితే తిరిగి హైడ్రేట్ అవుతుంది.
లాభాలు
రాత్రి నిద్ర పోవడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ జీవులు రెట్టింపు అవుతాయి. పళ్లు తోముకోవడానికి ముందే నీళ్లు తాగితే నోరు శుభ్రం అవుతుంది. తర్వాత పళ్లు తోముకోవడం మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఇమ్యునిటి కూడా పెరుగుతుంది. చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
నమ్మకం కుదరదు కానీ ఆశ్చర్యంగా నిద్ర లేవగానే నీళ్లు తాగే వారిలో బీపీ కూడా అదుపులో ఉంటుందట. రోజంతా షుగర్ కూడా పెరగదట. రోజును ఒక గ్లాసు నీటితో ప్రారంభిస్తే జీర్ణాశయంలో పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. ఫలితంగా అసిడిటీకి దూరంగా ఉండొచ్చు. ఇతర జీర్ణసమస్యలు కూడా పెద్దగా బాధించవు.
శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల ఈ అలవాటు చేసుకున్న కొద్ది రోజుల్లోనే చర్మం, జుట్టు మెరుస్తుండటం గమనించవచ్చు.
తర్వాత తాగడం వృథా
పళ్లు తోముకున్నాక పది నిమిషాల పాటు ఏమీ తీసుకోక పోవడమే మంచిది. ఎందుకంటే అప్పటి వరకు ఉపయోగించిన టూత్ పేస్ట్ లో ఉండే సుగుణాలు నోటిలో నిలిచి ఉండకుండా నీటితో వెళ్లిపోతాయి. నోటిలో మిగిలిపోయిన టూత్ పేస్ట్ వల్ల లాభం జరగాలంటే అది అలా నోటిలో నిలిచి ఉండాలి. అందుకే పది పదిహేను నిమిషాల పాటు ఏమీ తినకూడదు.