విధాత: పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం సరిపడా అందుతాయి. పెరుగు రోజు తీసుకుంటే మంచి ఫలితాలుటాయి. అయితే పెరుగును పొరపాటున కూడా కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అవేంటో ఓసారి తెలుసుకుందాం రండి..
- చాలా రకాల ప్రయోజలున్నా పెరుగును పెసరపప్పుతో కలిసి తీసుకోవద్దు. అలా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, వాపు, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.
- పెరుగుతో పాలను కలిపి తీసుకోవద్దు. అలా చేస్తే కడుపులో గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, వాంతులు, విరేచనాల సమస్యలు తప్పవు.
- చాలా మంది రైతా తీసుకుంటూ ఉంటారు. ఉల్లిపాయలతో పాటు పెరుగు తింటారు. కానీ అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెరుగును ఉల్లిపాయతో కలిపి తీసుకోవడం వల్ల కడుపు, అలర్జీలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే పెరుగును ఉల్లిపాయతో కలిపి తినకూడదు.