Site icon vidhaatha

Health Tips | హాయిగా నిద్రపట్టాలంటే.. ఈ అలవాట్లు మెరుగైన ఆరోగ్యానికి దివ్యౌషదం..! అవేంటో తెలుసుకోండి మరి..!

Health Tips | ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎలాంటి దినచర్యను అనుసరిస్తున్నాం.. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నామో.. ఇవన్నీ మన మొత్తం ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వరకు చాలా మంది ఉన్నా.. అయినప్పటికీ ఊబకాయంతో పాటు అనేక ఇతర వ్యాధుల ప్రమాదం పెంచుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. సాయంత్రానంతర దినచర్య కొన్ని గజిబిజి అలవాట్లు ఇలాంటి ప్రమాదాలను చాలావేగంగా పెంచుతున్నాయని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే ముందు మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ? ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నామనే విషయాలు మన ఆరోగ్యంపై సైతం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

చాలా మంది జనం చాలా పెద్ద మొత్తంలో డిన్నర్‌ తీసుకుంటున్నారని, ఆ తర్వాత వెంటనే నిద్రపోవడం తరుచుగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు అలవాట్లు ఆరోగ్యానికి చాలా హానికరమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఈ అలవాటు చాలా వేగంగా పెరుగుతున్నది. అయితే, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రాత్రి పూట నిద్రకు ముందు నిర్వహించాల్సిన కార్యాకలాపాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎలాంటి అలవాట్లను అనుసరించాలనో తెలుసుకుందాం..

రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోండి..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు అందులో మంచి పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. జీర్ణమయ్యేందుకు ఎక్కువగా సమయం తీసుకునే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అవి సరిగా జీర్ణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం రాత్రిపూట జీవక్రియ రేటు తక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల, తీసుకున్న ఆహారంలో పోషకాలను సరిగ్గా శోషించుకోదని, ఇది అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కావున తేలికపాటి ఆహారాన్నే ఎల్లప్పుడూ రాత్రిపూట తీసుకోవాలని సూచిస్తున్నారు.

భోజనం తర్వాత కొద్దిసేపు నడవండి..

రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాల పాటు నడవాలి. ఇలా చేస్తే మంచిగా నిద్రపట్టడంలో సహాయపడుతుంది. ఈ అలవాటు మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తప్పనిసరిగా నిద్రకు ముందు దాదాపు 10-15 నుంచి నిమిషాలపాటు వాకింగ్‌ చేస్తే అది భోజనం తర్వాత శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని పెంచదని, ఇది ఊబకాయం మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిద్రకు ముందు వాకింగ్‌ మంచి అలవాటని నిపుణులు పేర్కొంటున్నారు.

రాత్రిళ్లు వీటికి దూరంగా ఉండాలి..

కెఫిన్, నికోటిన్ నిద్రకు అంతరాయం అలిగిస్తాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత చాయ్‌, కాఫీ తీసుకునే అలవాట్లను ఉంటేనే వదిలేయాలి. రాత్రిపూట కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు పెరగడంతో పాటు జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. నిపుణులు కెఫిన్, నికోటిన్‌తోపాటు అల్కహాల్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

పసుపు పాలతో మంచి ప్రయోజనం

రోజంతా అలసట తర్వాత మంచిగా నిద్రపట్టాలంటే.. ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందు కప్పు పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగాలి. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరం నుంచి అలసట, నొప్పిని తొలగించి హాయిగా నిద్రపోవడానికి సహాయపడతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారికీ ప్రయోజనకరంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, పసుపు పాలు అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Exit mobile version