Site icon vidhaatha

Health Tips | నిమ్మకాయలు చలువకే కాదు.. ఇంకా చాలా లాభాలున్నాయ్‌..!

Health Tips : నిమ్మకాయ (Lemon) అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది నిమ్మరసం, నిమ్మకాయ పచ్చడి, పులిహోర. నిమ్మ రసం వేడి నుంచి ఉపశమనానికి, నిమ్మకాయ పచ్చడి, పులిహోర రుచికి పనికొస్తాయని అందరికీ తెలుసు. కానీ చాలామందికి అంతకుమించి నిమ్మ చేసే మేలు గురించి తెలియదు. ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపర్చుకోవడానికి కూడా నిమ్మకాయలు తోడ్పడుతాయి. ఇలా చెప్పుకుంటూపోతే నిమ్మతో లెక్కలేన‌న్ని ప్రయోజ‌నాలున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మతో లాభాలు

1. నిమ్మకాయ‌లు సీజ‌న‌ల్‌ రోగాలు ధ‌రిచేర‌కుండా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. తరచూ నిమ్మరసం (Lemon juice) తాగడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చు.

2. నిమ్మర‌సం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మలో కావాల్సినంత‌ సి విటమిన్ ల‌భిస్తుంది. త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకునే వారిలో వ‌య‌సు పెరుగుతున్నా చ‌ర్మం అంత త్వర‌గా ముడుత‌లు ప‌డ‌దు. దీంతో వృద్ధాప్య చాయ‌లు త్వర‌గా ద‌రిచేర‌వు.

3. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వ‌స్తుంది.

4. పంటినొప్పిని తగ్గించ‌డంలో కూడా నిమ్మర‌సం తోడ్పడుతుంది. నిమ్మలోని సిట్రిక్‌ యాసిడ్ పంటిలోని కణజాలాన్ని మొద్దుబారేలా చేస్తుంది. అదేవిధంగా చిగుళ్లలోంచి ర‌క్తం వ‌చ్చేవారు త‌ర‌చూ నిమ్మర‌సం తీసుకోవ‌డంవ‌ల్ల ప్రయోజ‌నం ఉంటుంది.

5. కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొల‌గించి, శుద్ధి చేయ‌డంలో కూడా నిమ్మరసం మంచి ఉప‌కారిగా ప‌నిచేస్తుంది.

6. వేసవిలో నిమ్మర‌సం తాగితే అల‌స‌ట నుంచి త్వర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. స్థూలకాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.

8. అంతేగాక నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించ‌డంలో తోడ్పడుతుంది.

Exit mobile version