Site icon vidhaatha

మళ్లీ షురూ: భయపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF 7.. భారత్‌లోనూ..

విధాత: ఒమిక్రాన్ తాజా వేరియంట్ బీఎఫ్‌.7 భ‌య‌పెడుతున్న‌ది. దీపావ‌ళి సెల‌వుల వేళ ఈ కొత్త వేరియంట్ మ‌రో ప్ర‌మాదానికి దారి తీసే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే చైనాలో కొత్త కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైన కొత్త వేరియంట్‌ల వ‌ల్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. వ‌చ్చే రెండు మూడు వారాలు అత్యంత కీల‌కమ‌ని నిపుణులు అంటున్నారు.

గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా కొవిడ్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఒక‌దాని త‌ర్వాత ఒకటి వ‌స్తూ కొవిడ్ ఉధృతికి కార‌ణ‌మౌతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ నుంచి రెండు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. బీఎఫ్‌.7, బీఎఫ్‌.1.5.1.7 వేరియంట్లు వేగంగా విస్త‌రిస్తున్నాయి.

ఇవి డెల్టా అంత ప్ర‌మాద‌క‌రం కాక‌పోయినా వేగంగా వ్యాపిస్తుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్నది. దీపావ‌ళి సెల‌వుల్లో ఈ కొత్త వేరియంట్లు మ‌రో వేవ్‌కు దారి తీసే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఎఫ్‌.7 మొద‌ట వాయువ్య చైనా, మంగోలియా అటాన‌మ‌స్ రిజియ‌న్‌లో గుర్తించారు.

అనంత‌రం ఇది బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా, బెల్జియం త‌దిత‌ర దేశాల‌కు పాకింది. భార‌త్‌లోనూ దీన్ని గుర్తించారు. చైనాలో కొత్త కేసులు పెరుగుతుండ‌టానికి ఈ కొత్త వేరియంట్లే కార‌ణ‌మ‌ని ఆరోగ్య‌నిపుణులు పేర్కొంటున్నారు.

ఇత‌ర వేరియంట్ల కంటే బీఎఫ్‌.7 వేరియంట్ టీకాలు, గ‌తంలో కొవిడ్ సోకిన వ్యాధి నిరోధ‌క‌త‌ను ఏమార్చుకున్న‌ద‌ని ఇప్ప‌టికే రెండు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. వ‌చ్చే రెండు మూడు వారాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్ప‌టికే కొత్త వేరియంట్ల వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు చోట్ల న‌మోద‌య్యాయి. ఈ నేప‌థ్యంలో పండుగ‌ల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version