Site icon vidhaatha

Zero Shadow Day | హైదరాబాదీలూ గెట్‌ రెడీ..! నేటి మధ్యాహ్నం మీ నీడ మాయం.. మీరూ ఇలా ట్రై చేయండి..!

Zero Shadow Day | అద్భుతమైన ఖగోళ సన్నివేశం నేడు హైదరాబాద్‌లో ఆవిష్కృతం కానున్నది. ఈ అద్భుతాన్ని జీరోషాడో డేగా పిలుస్తుంటారు. ఇందులో ఎండలో ఉన్న వస్తువుల నీడ కనిపించదు. మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో ఈ దృగ్విషయం ఏర్పడబోతున్నది.

అయితే, సాధారణంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో వస్తువు నీడ పడదు. అత్యున్నత స్థాయిలో జీరోషాడో డే ఏర్పడనున్నది. ఈ సమయంలో ఎండలో మనిషి ఉన్నా నీడ వారి కాళ్ల కిందకు వెళ్తుంది. పాదాల చివరలో కుడి, ఎడమల ఏదో ఒక వైపు కనిపిస్తుంది.

ఏడాదికి రెండు సార్లు జరుగుతుండగా.. ఈ ఏడాది మే నెలలోనూ ఖగోళ సన్నివేశం అలరించింది. ఎండలో నిటారుగా (90డిగ్రీల) ఉంచిన వస్తువుల నీడ 12.22 గంటల కనిపించదని ఖగోళ నిపుణులు తెలిపారు. అయితే, అరుదైన దృగ్విషయాన్ని హైదరాబాద్‌ నగరవాసులు తప్పకుండా అనుభూతి చెందాలని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు సూచించారు. ఇందు కోసం చెట్లు, భవనాలుగా లేని ఖాళీ ప్రదేశాల్లో.. లేదంటే ఎత్తైన భవనాలపై మధ్యాహ్నం 12.22 గంటల సమయంలో నిలబడాలని.. ఆ సమయంలో నీట కనిపించదని తెలిపారు.

అయితే, సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఏర్పడుతుంది. ఇలా నీడ కనబడకుండా పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని ఖగోళ పండితులు పేర్కొంటున్నారు. నిత్యం భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. ఇందుకు 24 గంటల సమయం పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలో సూర్యుడు తూర్పు నుంచి ఉదయించి పడమర దిక్కున అస్తమించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా వెళ్తున్న సమయంలో సూర్యుడు తలమీదుగా వెళ్తున్నట్లుగా ఉంటుంది. అయితే, సూర్య కిరణాలు నిట్ట నిలువుగా 90డిగ్రీల కోణంలో భూమిమీద పడుతుంటాయి. ఈ సమయంలో నిలువుగా ఉన్న ఏదైనా వస్తువులతో పాటు మనుషులు ఉన్నా నీడ కనిపించదు. ఇందుకు కారణం ఆ నీడ ఆ వస్తువు మీదనే పడుతుండడం. ఈ దృగ్విషయాన్నే జీరోషాడో డే మూవ్‌మెంట్‌ అని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

నిత్యం సూర్యుడు మధ్యాహ్న సమయంలో తలమీదుగా వెళ్తున్నట్లుగా ఉంటుందని.. కానీ అలా వెళ్లడని పేర్కొన్నారు. ఇందుకు ముందు మే9న ‘జీరో షాడో డే’ ఏర్పడింది. అలాగే బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం సాక్షాత్కరించింది. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటల సమయంలో రెండు నిమిషాల పాటు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ కనిపించకుండాపోయింది.

Exit mobile version