విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్బంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు, నజరానాలు పంచుతుందంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న ఆధారాలను సమర్పించారు. మంగళవారం పోలింగ్ నేపథ్యంలో అధికార పార్టీ డబ్బు పంపిణీని కట్టడికి చర్యలు తీసుకుని ఎన్నికలను స్వేచ్చగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చూడాలని బీఆర్ఎస్ బృందం కోరింది.
