Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ కేసులో నేడు సీఐడీ విచారణకు హీరోయిన్స్

బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో సెలబ్రిటీలపై విచారణ వేగం పెరిగింది.

విధాత, హైదరాబాద్: బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హీరోయిన్స్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరిలు నేడు మధ్యాహ్నం 2గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, రాణా, ప్రకాశ్ రాజ్, యాంకర్ విష్ణు ప్రియలను విచారించిన సీఐడీ బృందం కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రేటీలను వరుసగా విచారిస్తుంది. వారి వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. బ్యాంకు అకౌంట్లు, వారి ఆర్థిక లావాదేవీలు, ఆదాయ వివరాలపై ఆరా తీస్తుంది.

బెట్టింగ్‌ యాప్స్ కు హీరోయిన్స్‌, సెలబ్రిటీలు ప్రచారం కల్పించడంతో పలువురు యువకులు వాటికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ పలు పీఎస్‌లల్లో కేసులు నమోదవడంతో వాటి విచారణకు సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆయా కేసుల్లో హీరో విజయ్‌ దేవరకొండతో పాటు సినీనటులు రాణా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల సహా సినీ, టీవీ నటులు, యూట్యూబర్లు మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో అటు ఈడీ కూడా విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News