విధాత, హైదరాబాద్ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి 17 శాతమే ఇవ్వడంపై చర్చించేందుకు గురువారం సాయి ఈశ్వర్ తీన్మార్ మల్లన్న ఆఫీస్ కు వెళ్లాడు.
అక్కడ అనుహ్యంగా సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పేసి ఆసుపత్రికి తరలించారు. ఈరోజు చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ తుది శ్వాస విడిచాడు.
బీసీ సంఘాల ఆందోళన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్‌కి న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకి చేరుకొని ఆందోళన నిర్వహించారు. సాయి ఈశ్వర్ మరణం ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్య అని.. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలే ఈ హత్యకు బాధ్యత వహించాలంటూ బీసీ సంఘాల డిమాండ్ చేశాయి. ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్బంగా కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి :
Revanth Reddy : ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతైనా ఖర్చు పెడుతాం
22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్ షాక్! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్!
