White House Car Crash : వైట్ హౌస్ ను ఢీ కొట్టిన కారు..ట్రంప్ అందులోనే!

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ (శ్వేత సౌధం) గేటును వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ లోపల ఉన్నారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైట్ హౌస్ వద్ద భద్రతా లోపాలను మళ్లీ బయటపెట్టింది.

Car Crashes Into White House

విధాత : శత్రు దుర్బేధ్యంగా భావించే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ (శ్వేత సౌధం)ను ఓ సాదా సీదా కారు ఢీ కొట్టింది. ఈ సంఘటన వైట్ హౌస్ వద్ద భద్రతా వ్యవస్థను ప్రశ్నార్థకం చేసింది. వేగంగా దూసుకొచ్చిన కారు శ్వేతసౌధం గేటును ఢీకొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లోపల ఉండటం గమనార్హం. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కావాలనే వైట్ హౌస్ ను లక్ష్యంగా చేసుకుని కారుతో ఢీ కొట్టాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన వైట్ హౌస్ వద్ధ భద్రతా లోపాలను మరోసారి బహిర్గతం చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గత ఏడాది జనవరి, మే నెలలోనూ వైట్ హౌస్ గేటును ఓ వాహనం ఢీ కొట్టింది. గత మే నెలలో కారు ఢీ కొట్టిన ఘటనలో డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఆ తర్వాత వైట్‌హౌస్‌ వద్ద భారీ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. అయినప్పటికి మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.