శునకం యోగాసనాలు..నెటిజన్లు షాక్ !

విధాత:ఆస్ట్రేలియా(కాన్బెర్రా): మనిషి జీవితంలో సోషల్‌ మీడియా భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్‌ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు తమ పెంపుడు జంతువుల విన్యాసాలను షేర్‌ చేస్తుంటారు. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు శునకం. విశ్వాసం చూపడంలో ఇది ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క యోగాసనాల వీడియో సోషల్‌ మీడియాలో తెగ […]

  • Publish Date - May 19, 2021 / 07:14 AM IST

విధాత:ఆస్ట్రేలియా(కాన్బెర్రా): మనిషి జీవితంలో సోషల్‌ మీడియా భాగమైపోయింది. మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ సోషల్‌ మీడియాలోనే అధికంగా పంచుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు నెటిజన్లు తమ పెంపుడు జంతువుల విన్యాసాలను షేర్‌ చేస్తుంటారు. మనిషి మచ్చిక చేసుకున్న మొదటి జంతువు శునకం. విశ్వాసం చూపడంలో ఇది ఎప్పుడూ ముందు ఉంటుంది. అందుకే శునకాలు, మనుషుల మధ్య సంబంధం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క యోగాసనాల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆస్ట్రేలియాలో గొర్రెలకు కాపలా ఉండే ఆ శుకనం పేరు సీక్రెట్‌. ఈ శునకం చాపపై యోగా చేస్తూ.. దాని యజమాని మేరీని అనుకరిస్తుంది.

ఈ వీడియోను “మై ఆసి గాల్‌” అనే క్యాప్సన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియోను మాజీ అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు రెక్స్‌ చాప్మన్‌” ఈ కుక్క వాస్తవానికి యోగా చేస్తోంది.” అనే క్యాప్సన్‌తో ట్విట్టలో షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చాలా మంది హృదయాలను గెలుచుకుంటోంది.