విధాత : అమెరికాలోని డల్లాస్(Dallas) నగరంలో ఓ మోటెల్‌లో మేనేజర్‌గా(Motel Manager) పని చేస్తున్నభారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్య(50)(Chandra Mouli Nagamallaiah) దారుణ హత్యకు గురైన ఘటన సంచలనం రేపింది. భార్య, కొడుకు చూస్తుండగానే నాగమల్లయ్య తల నరికిన దుండగుడు..తలను కాలితో బంతిలా తన్ని..చేతితో పట్టుకుని డస్ట్ బిన్ లో పడేసిన కిరాతక చర్య స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ.. ఈ దారుణానికి దారి తీసింది.
ప్రత్యక్ష సాక్షి ఓ మహిళ కథనం మేరకు తనతో పాటు నిందితుడు యోర్ధనిస్ కోబాస్ మార్టినేజ్(37)(Yordanis Cobos-Martine) మోటల్ లో పనిచేస్తున్నారు. గదిని శుభ్రం చేసున్న క్రమంలో మోటల్ మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్యను పాడైపోయిన వాషింగ్ మెషిన్ వాడరాదంటూ కోబాస్ మార్టినేజ్ కు చెప్పాడు. ఆ విషయాన్ని ఆ మహిళకు చెప్పి అతనికి అర్ధమయ్యే భాషలో చెప్పమని సూచించాడు. నాగమల్లయ్య(Nagamallaiah) వైఖరితో ఆగ్రహానికి గురైన కోబాస్ నేరుగా తన గదిలోని వెళ్లి బ్యాగులో ఉన్న కత్తిని తీసుకుని వచ్చి అతడిపై దాడికి పాల్పడ్డాడు. భయంతో నాగమల్లయ్య ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న నాగమల్లయ్య భార్య, కొడుకులు నిందితుడికి అడ్డుపడినప్పటికి వారిని పక్కకు నెట్టివేశాడు. నాగమల్లయ్య వెంటపడి మరి కిరాతకంగా కత్తితో దాడి చేసి..తల నరికివేశాడు. తెగిపడిన తలను కాలితో తన్నడంతో అది మోటల్ బయటకు వెళ్లి పడింది. ఆ తర్వాత తలను చేతితో పట్టుకుని దగ్గరలోని డస్ట్ బిన్ లో పడేశాడు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హత్యానేరం కింద కోబాస్ మార్టినేజ్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై అమెరికాలోని భారత కాన్సులెట్ స్పందించి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసి.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చింది. నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారని తెలిపింది.