కన్న కొడుకు చేతిలో తండ్రి హత్య
వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో తనయుడు చేతిలో తండ్రి హతమైన విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భార్యను హత్య చేసేందుకు ప్రయత్నం
విధాత, వరంగల్ ప్రతినిధి: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో తనయుడు చేతిలో తండ్రి హతమైన విషాదకర సంఘటన ఆదివారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
సభావత్ సురేష్ అనే వ్యక్తి తన భార్యను తీవ్రంగా కొడుతుండగా అడ్డువచ్చిన తండ్రి రాజు (60)ను కొడుకు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డు వస్తుందనే కారణంగా ఆమెను హత్య చేయాలని ఆలోచనతో ఆమెను తీవ్రంగా కొడుతుండగా తండ్రి అడ్డుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు ఆరోపిస్తున్నారు. కాగా సంఘటన సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసు విచారణలో వెల్లడి కానున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram