Punganur tragedy| బైక్ పొగ పీల్చి… ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం విషాదం రేపింది. బైక్‌ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక వారంతా మృతి చెందారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Mar 15, 2026, 11:29 am IST
Read Time: 2 mins
Punganur tragedy| బైక్ పొగ పీల్చి… ఒకే కుటుంబంలో నలుగురు మృతి

విధాత, హైదరాబాద్ : అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం విషాదం రేపింది. బైక్‌ నుంచి వచ్చిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక వారంతా మృతి చెందారు. పుంగనూరులోని త్యాగరాజు వీధిలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు. మురళి, రేవతి భార్యాభర్తలు. ఆయనకు తండ్రి రామచంద్రయ్య, కుమారుడు కార్తీక్‌, కవల కుమార్తెలు చరిత, చందన ఉన్నారు.

మురళి శనివారం తన ద్విచక్ర వాహనాన్ని మెకానిక్‌ వద్ద మరమ్మతు చేయించాడు. మెకానిక్ వద్ద బైక్‌ను బోర్ చేయించగా రాత్రంతా స్టార్ట్‌లో ఉంచాలని మెకానిక్ చెప్పడని …మురళి ఇంట్లో తలుపులేసి బైక్‌ను స్టార్ట్‌లో ఉంచాడు. శనివారం రాత్రి తండ్రి, మనవడు, మనవరాళ్లు ఇంట్లో నిద్రించగా.. మురళి, రేవతి ఇంటిపైన గదిలో పడుకున్నారు. ఇంటి తలుపులు మూసి ఉండటంతో బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ముగ్గురు చిన్నారులు, తాత మృతి చెందారు, డాబాపై పడుకున్న మురళి, రేవతి ప్రాణాలతో బయటపడ్డారు.