Moradabad : 15 రోజుల పసికందును ఫ్రీజర్‌లో పెట్టిన తల్లి
ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌లో మానసిక సమస్యలతో బాధపడిన తల్లి 15 రోజుల పసికందును ఫ్రీజర్‌లో పెట్టగా కుటుంబం సమయానికి రక్షించింది.

విధాత: కడుపున పుట్టిన పసికూన పట్ల ఓ కన్నతల్లి వ్యవహరించిన తీరు చూస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే.. తొమ్మిది నెలలు కడుపారా మోసి ఎంతో ప్రేమగా పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లే మానసిక సమస్యలతో బిడ్డను ప్రీజర్‌లో పెట్టి మరిచిపోయింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మొరాదాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసవానంతరం పలు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళ శుక్రవారం రాత్రి చిన్నారిని పడుకోబెట్టిన అనంతరం ఫ్రీజర్‌లో పెట్టింది. అనంతరం మర్చిపోవడంతో చిన్నారి ఏడుపులు విన్న కుటుంబ సభ్యులు రక్షించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!