Ganja Seizure| శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్‌ఐ రూ.14 కోట్ల గంజాయి స్వాధీనం. డ్రగ్స్ రవాణా పెరుగుదలపై ఈగల్ టీమ్స్ కట్టడి అవసరమని నిపుణుల అభిప్రాయం.

Ganja Seizure| శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

విధాత, హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad Airport)లో రూ.14కోట్ల విలువైన గంజాయి(Ganja Seizure)ని డీఆర్ఐ(DRI)అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ రిజ్వీ(Syed Rizwi)గా డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ రూ.14 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్స్ (Eagle Teams Telangana)ఏర్పాటు చేసి డ్రగ్స్, గంజాయి రవాణా(Drug Trafficking) కట్టడికి ప్రయత్నిస్తున్నప్పటికి రాష్ట్రంలో తరుచు గంజాయి, డగ్ర్స్ దందాలు వెలుగుచూస్తున్న తీరు సమస్య తీవ్రతను చాటుతుందంటున్నారు నిపుణులు. ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ లో రూ.12వేల కోట్ల డ్రగ్స్ పట్టుకోవడం చూస్తే రాష్ట్రంలో ఈగల్ టీమ్స్ తమ నిఘా నెట్ వర్క్ ను మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని వెల్లడిస్తుందంటున్నారు.