ప్రతిభ కబనబరిచిన పోలీసు జాగిలం భైరవ్ కి గోల్డ్ మెడల్
వరంగల్ కమిషనరేట్‌కు చేరిన బీగల్ జాతి పోలీస్ జాగిలం భైరవ్ శిక్షణలో ఉత్తమ ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించింది. పేలుడు పదార్థాల గుర్తింపులో కీలక పాత్ర పోషించనుంది.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలియజేశారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తమ సేవలందించేందుకు వచ్చాయి. నూతనంగా విధుల్లోకి చేరిన సందర్భంగా పోలీస్ జాగిలాలను వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఈ పోలీస్ జాగిలాల హ్యాండ్లర్లు కుమార స్వామి (భైరవ్ హ్యాండ్లర్), సాంబయ్య (విరాట్ హ్యాండ్లర్) లను జాగిలాల పనితీరును అడిగితెలుసుకున్నారు. అనంతరం శిక్షణ కాలంలో జాగిలాలకు నిర్వహించిన క్లిష్టతరమైన పరీక్షల్లో ఉత్తమంగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్ జాగిలానికి సిపి మెడల్ అలంకరించి హ్యాండ్లర్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ నూతన జాగిలాలు పేలుడు పదార్థాలను సులభంగా పసిగడితాయని. ఈ శునకాలు చూడటానికి చిన్న అకారంలో వున్నప్పటికీ పెద్ద జాగిలాలు వెళ్ళలేని ప్రదేశాలు, మార్గాల్లో ఈ జాగిలాలు వెళ్ళి పేలుడు పదార్థాలను గుర్తిస్తాయన్నారు. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపర్చే క్యాబిన్లల్లో కార్ల క్రిందకు వెళ్ళి పేలుడు పదార్థాలను గుర్తించడం ఈ జాగిలాల ప్రత్యేకతని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా ఈ పోలీస్ జాగిలాల ద్వారా గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో కేసుల్లో నిందితులను గుర్తించడంతో పాటు మత్తు పదార్థాలను గుర్తించామని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.
ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు శ్రీనివాస్,రవి,ఏసిపి సురేంద్ర,ఆపరేషన్స్ అర్.ఐ సింహచలం శ్రీనివాస్, డాగ్ స్వ్కాడ్ ఇంచార్జ్ ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Odisha ganja seizure| రూ.200 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Aggressive Elephant | ఓ వ్యక్తిని తొండంతో విసిరిపడేసిన గజరాజు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram