• Telugu News
  • /National

MA Marathi course | 78 ఏళ్ల వ‌య‌సులో ఎంఏలో గోల్డ్‌ మెడల్ సాధించి.. వ‌య‌సు విజ‌యానికి అడ్డుకాద‌ని నిరూపించింది..

మధ్యప్రదేశ్‌కు చెందిన సుష్మా మోఘే (Sushma Moghe) అనే 78 ఏళ్ల మహిళ ఎం.ఏ మరాఠీ కోర్సు (MA Marathi course)లో గోల్డ్‌ మెడల్ (gold medal) సాధించి వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మేన‌ని నిరూపించింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 19, 2026, 12:56 pm IST
Read Time: 3 mins
MA Marathi course | 78 ఏళ్ల వ‌య‌సులో ఎంఏలో గోల్డ్‌ మెడల్ సాధించి.. వ‌య‌సు విజ‌యానికి అడ్డుకాద‌ని నిరూపించింది..

MA Marathi course | జీవితంలో ఏదైనా సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌, సంక‌ల్పం ఉంటే అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లం. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ మ‌హిళ‌. 80 ఏళ్ల వ‌య‌సులోనూ ఎం.ఏ మరాఠీ కోర్సు (MA Marathi course)లో గోల్డ్‌ మెడల్ (gold medal) సాధించి వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మేన‌ని నిరూపించింది. అనుకున్నది సాధించడానికి వయసు అడ్డుకాదని అంద‌రికీ చాటి చెప్పింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన సుష్మా మోఘే (Sushma Moghe) అనే 78 ఏళ్ల మహిళ గ‌తంలో ఓ సెంట్రల్ స్కూల్‌లో సంగీత ఉపాధ్యాయురాలిగా ప‌నిచేసింది. త‌న 40 ఏళ్ల‌పాటూ పిల్ల‌ల‌కు సంగీత పాఠాలు నేర్పింది. ఆ త‌ర్వాత రిటైర్మెంట్ తీసుకుంది. రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండలేక, తన మాతృభాష అయిన మరాఠీపై ఉన్న మక్కువతో 76 ఏళ్ల వయసులో ఇండోర్‌లోని దేవి అహల్య విశ్వవిద్యాలయంలో (Devi Ahilya Universityస‌) ఎంఏ మరాఠీ కోర్సులో చేరింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి బంగారు పతకం సాధించి వార్తల్లో నిలిచింది.

ఫిబ్రవరి 17న‌ జరిగిన స్నాతకోత్సవంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ చేతుల మీదుగా ఆమె బంగారు పతకాన్ని అందుకున్నారు. కోర్సు పూర్తిచేయటంలో త‌న‌కు పూర్తిగా స‌హ‌క‌రించిన యూనివర్సిటీ అధ్యాపకుల‌కు సుష్మా మోఘే కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆమె హిందీ సాహిత్య పుస్తకాలను మరాఠీలోకి అనువదిస్తున్నారు. ఏదైనా నేర్చుకోవ‌డానికి వ‌య‌సుతో సంబంధం లేద‌ని నిరూపించింది. ఆమె విజ‌యం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Karegutta Hills encounter| కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల హతం
నడుస్తుంది, గాలిలో ఎగురుతుంది.. ఈ వింత చేపను ఎప్పుడైనా చూశారా?