World Speed Skating Championship| వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్ కు రెండు స్వర్ణాలు
వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్ వెల్‌కుమార్ రెండు స్వర్ణ పతకాలు సాధనతో చరిత్ర సృష్టించాడు. 42 కిలోమీటర్ల మెన్స్ మారథాన్‌లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని సాధించాడు. అంతకుముందు ఆయన 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణ పతకాన్ని, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య నెగ్గాడు.

విధాత : వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో(World Speed Skating Championship) భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్ వెల్‌కుమార్(Anandkumar Velkumar) రెండు స్వర్ణ పతకాలు(two gold medals) సాధించి చరిత్ర సృష్టించాడు. ఆదివారం నిర్వహించిన 42 కిలోమీటర్ల మెన్స్ మారథాన్‌లో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని సాధించాడు.
అంతకుముందు ఆయన 1000 మీటర్ల స్ప్రింట్‌లో స్వర్ణ పతకాన్ని, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య నెగ్గాడు. ఈ ఛాంపియన్ షిప్ లో రెండు సార్లు విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా ఆనంద్‌కుమార్ రికార్డు సాధించాడు. మొత్తంగా మూడు పతకాలు సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా నిలిచాడు.