Neeraj Chopra | ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ పతకం నెగ్గితే.. అందరికీ ఫ్రీగా షెంజెన్ వీసా ఇస్తారట..!
Neeraj Chopra | ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ క్రీడల్లో భారత్ రెండు కాంస్య పతకాలను నెగ్గింది. షూటింగ్‌లో మాత్రమే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. మిగతా క్రీడల్లో ఆటగాళ్లు నిరాశపరిచారు. తాజాగా అందరి దృష్టి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై పడింది.

Neeraj Chopra | ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ క్రీడల్లో భారత్ రెండు కాంస్య పతకాలను నెగ్గింది. షూటింగ్‌లో మాత్రమే భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. మిగతా క్రీడల్లో ఆటగాళ్లు నిరాశపరిచారు. తాజాగా అందరి దృష్టి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై పడింది. ఈ సారి ఒలింపిక్స్‌లో గోల్డ్ పతకం నెగ్గాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కంపెనీ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం నెగ్గితే స్కెంజెన్ వీసా ఇస్తామని ప్రకటించింది. షెంజెన్ వీసాను ఐరోపా వెళ్లేందుకు జారీ చేస్తుంటారు.
ఈ వీసాతో యూరప్‌లోని షెంజెన్ ప్రాంతంలో 180 రోజుల్లో 90 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే.. అర్హత ఉన్న అందరికీ ఉచితంగా వీసాలు జారీ చేస్తామని ఆన్‌లైన్ వీసా అప్లికేషన్ ప్లాట్‌ఫామ్ అట్లీస్ వ్యవస్థాపకుడు మోహక్ నహ్తా లింక్డ్‌ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. కంపెనీ అట్లాస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లోనూ ప్రకటించింది. ఉచిత వీసాకు సంబంధించి ఆయన, కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఈ నెల పారిస్ కోసం వీసా దరఖాస్తులు వేగంగా పెరుగుతున్నాయని కంపెనీ తెలిపింది. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అట్లాస్ ప్లాట్‌ఫారమ్‌లో ప్యారిస్‌కు ప్రయాణానికి సంబంధించిన జాబితాలు దాదాపు 40శాతం పెరిగాయి.
పారిస్‌లోని ఒలింపిక్స్, ఇతర మైలురాయి ప్రదేశాలతో పాటు ప్రజలు నైస్, ఆబర్‌విల్లియర్స్, కొలంబస్, సెయింట్-ఓవెన్ సుర్ సీన్ తదితర ప్రదేశాలను సైతం సందర్శించాలని చాలామంది భావిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతీయ పర్యాటకులు ఐదేళ్ల వరకు స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. షెంజెన్ వీసాతో 29 దేశాల్లో పర్యటించేందుకు వీలు ఉంటుంది. ఇందులో బెల్జియం, బల్గేరియా, ఎస్టోనియా, గ్రీస్, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, ఆస్ట్రియా, పోలాండ్, పోర్చుగల్, లక్సెంబర్గ్, హంగేరి, మాల్టా, నెదర్లాండ్స్, రొమేనియా, స్లోవేనియా, స్లోవేనియా, స్వీడన్, ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ తదితర దేశాలున్నాయి.