భారత్ అథ్లెటిక్స్ చరిత్రలో గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డు!
2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో గుర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించారు. ఈ రేసును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు.
విధాత, హైదరాబాద్: భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రేసర్‌గా గుర్విందర్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో గుర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించారు. ఈ రేసును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. రాంచీ వేదికగా జరుగుతున్న నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో పంజాబ్ స్ప్రింటర్ గుర్విందర్ సింగ్ సరికొత్త రికార్డుతో సంచలనం సృష్టించారు.
ఈ విజయంతో ఆయన కామన్వెల్త్, ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. అంతకుముందు అనిమేష్ కుజూర్ పేరిట ఉన్న జాతీయ రికార్డును గుర్విందర్ బద్దలు కొట్టి, దేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా నిలిచారు.
భారత్ అథ్లెటిక్స్ రంగంలో అదికూడ రన్నింగ్ రేసులో సరికొత్త జాతీయ రికార్డు నమోదవ్వడం అథ్లెటిక్స్ విభాగానికి కొత్త జోష్ ను ఇచ్చేదిగా కనిపిస్తుంది. క్రికెట్ ఆధిపత్యం కొనసాగుతున్న భారత క్రీడారంగంలో ముఖ్యంగా అథ్లెటిక్స్ క్రీడలలో గుర్విందర్ సింగ్ సాధించిన రికార్డు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
2026 అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్ పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌లో గురిందర్ వీర్ సింగ్ బంగారు పతకం సాధించారు.
🔹 ఈ రేసును కేవలం 10.09 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు.
🔹 భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రేసర్‌గా గురిందర్ చరిత్ర సృష్టించారు.… pic.twitter.com/PXMnQWV5uy
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) May 24, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram