Aggressive Elephant | ఓ వ్యక్తిని తొండంతో విసిరిపడేసిన గజరాజు
కేరళ (Kerala) త్రిస్సూర్ (Thrissur)లో జరుగుతున్న ఓ ఆలయ ఉత్సవాల్లో ఏనుగు (Aggressive Elephant) బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిని తన తొండంతో పైకి లేపి అవతలికి విసిరిపడేసింది.
Aggressive Elephant | కేరళ (Kerala) త్రిస్సూర్ (Thrissur)లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆలయ ఉత్సవాల్లో ఆగ్రహానికి గురైన గజరాజు.. ఓ వ్యక్తిపై దాడి చేసింది. ఏకంగా అతడిని తన తొండంతో పైకి ఎత్తి విసిరేసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
త్రిస్సూర్‌లో ఓ ఆలయ ఉత్సవాల కోసం కొన్ని ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కోసం వాటిని ముస్తాబు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. తొలుత దానిపైకి ఎక్కేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే మధ్యలో ఎక్కలేక కిందకు దిగాడు. ఆ తర్వాత అక్కడున్న వారి సాయంతో ఎట్టకేలకు పైకి ఎక్కి కూర్చున్నాడు.
ఆ సమయంలో గజరాజుకు కాస్త కోపం వచ్చినట్లుంది. తన ముందు ఉన్న ఓ వ్యక్తిని తన తొండంతో ఒక్కసారిగా పక్కకు లాగింది. అనంతరం అతడిని అమాంతం గాల్లోకి లేపి విసిరి అవతలికి పడేసింది. ఈ ఘటనలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ఏనుగు చర్యకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Shocking incident from Thrissur, Kerala 😳
An elephant picked up a young man and hurled him during a temple festival.
He is now critically injured. pic.twitter.com/TypJh15lR2
— Hinduism_and_Science (@Hinduism_sci) February 26, 2026
ఇవి కూడా చదవండి :
Gen Z Worker | చివరి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఉద్యోగి
Vendors Apply Rat Poison To Fruits | ఫ్రూట్స్‌ను కడగకుండా తింటున్నారా..? జాగ్రత్త వాటికి ఎలుకల మందు పూస్తున్నారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram