Gen Z Worker | చివ‌రి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్‌.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన‌ ఉద్యోగి

సిమ్రాన్ అనే జెన్ జెడ్ ఉద్యోగి (Gen Z Worker).. నెల రోజుల ముందే లీవ్ కావాల‌ని బాస్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. అయితే, చివ‌రి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేయ‌డంతో ఆమె త‌న బాస్‌కు ఐ డోంట్ కేర్ (I dont care) అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది.

Gen Z Worker | చివ‌రి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్‌.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చిన‌ ఉద్యోగి

Gen Z Worker | సాధారణంగా ఉద్యోగులు (employees) లీవ్స్ విషయంలో తరచుగా తమ బాస్‌లతో గొడవలు పడుతుంటారు. కొన్నికంపెనీలు ఎంప్లాయీస్‌కి అవ‌స‌ర‌మైన‌ప్పుడు సెల‌వులు ఇస్తుంటే.. మ‌రికొన్ని సంస్థ‌లు సెల‌వుల విష‌యంలో ఉద్యోగుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తుంటాయి. ఉన్న సెల‌వుల‌ను వాడుకునేందుకు కూడా అనుమ‌తించ‌వు. ఒక్కోసారి లీవ్స్‌ను యాక్సెప్ట్ చేసినా చివ‌రి నిమిషంలో ప‌నివంక చెప్పి క్యాన్సెల్ చేస్తుంటాయి (leave canceled). అయినా ఉద్యోగులు త‌మ బాస్‌ని ప‌ట్టించుకోరు ఫ్యామిలీకే ప్రిఫ‌రెన్స్ ఇచ్చి త‌మ లీవ్స్ వాడుకుంటుంటారు. తాజాగా ఓ ఉద్యోగికి కూడా అలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.

ఐ డోంట్ కేర్‌

సిమ్రాన్ అనే జెన్ జెడ్ ఉద్యోగి (Gen Z Worker).. నెల రోజుల ముందే లీవ్ కావాల‌ని బాస్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. అందుకు మేనేజ‌ర్‌ కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఆమె త‌న ట్రిప్‌కు అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. కాసేప‌ట్లో ఫ్లైట్ ఎక్కుతుంది అనంగా.. ఆమెకు త‌న బాస్ నుంచి మెసేజ్ వచ్చింది. లీవ్స్ క్యాన్సెల్ చేస్తున్నాం వ‌ర్క్ ఉంది వెంట‌నే ఆఫీస్‌కు రావాల‌ని మెసేజ్ సెండ్ చేశాడు. దీంతో ఆగ్ర‌హించిన స‌ద‌రు ఉద్యోగిని త‌న మేనేజ‌ర్‌కు “ఐ డోంట్ కేర్” (I dont care) అంటూ దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చింది.

ఆ త‌ర్వాత త‌న‌కు ఎదురైన ఈ అనుభ‌వాన్ని స‌ద‌రు యువ‌తి సోష‌ల్ మీడియాలో వీడియో రూపంలో పోస్టు చేసింది. త‌న ప్లాన్ గురించి కొన్ని వారాల ముందే మేనేజ‌ర్‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు పేర్కొంది. ఆ స‌మ‌యంలో మేనేజ‌ర్ త‌న లీవ్‌కు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని తెలిపింది. అయితే, విమానం ఎక్కేందుకు ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర ప్రాజెక్ట్ ప‌నుల కార‌ణంగా సెల‌వులు ర‌ద్దు చేస్తున్న‌ట్లు త‌న‌కు మేనేజ‌ర్ నుంచి స‌మాచారం వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ మెసేజ్ త‌న‌ను తీవ్ర అస‌హ‌నానికి గురి చేసిన‌ట్లు చెప్పుకొచ్చింది.

ఉద్యోగుల వ్య‌క్తిగ‌త స‌మ‌యం ప‌ట్ల గౌర‌వం లేక‌పోవ‌డాన్ని ఆమె ఎత్తి చూపింది. ఆఫీస్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు రావ‌డం స‌హ‌జ‌మేన‌ని.. అయితే, అవి ప‌దేప‌దే వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు అడ్డుకాకూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో వ‌ర్క్‌-లైఫ్ బ్యాలెన్స్‌పై కొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇవి కూడా చదవండి :

Supreme Court : న్యాయవ్యవస్థను అభాసు పాలు చేసే కుట్ర..ఆ పాఠ్యాంశం
Earthquake : తెలంగాణలో భూకంపం అలజడి