Sweden : ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కుప్పకూలిన స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి

స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే కుప్పకూలి ఆస్పత్రికి తరలించబడ్డారు.

విధాత: స్వీడన్‌కు(Sweden) చెందిన ఆరోగ్యశాఖ మంత్రి(Health Minister) ఎలిసాబెట్ లాన్( Elisabet Lann) ప్రెస్‌మీట్‌లో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొంత సేపటికే ఈ ఘటన జరగడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్( Prime Minister Ulf Kristersson) ప్రెస్ మీటి నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎలిసాబెట్‌ లాన్‌ను(Elisabet Lann) ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె రిపోర్టర్లతో మాట్లాడారు. ప్రధాన మంత్రి మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఎలిసాబెట్ లాన్ ఉన్నట్లుండి కూప్పకూలారు. దీంతో పక్కన ఉన్నవారు అప్రమత్తమై ఆమెను ఆసుపత్రికి తరలించారు. షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడం మూలంగానే తాను ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.