హాలీవుడ్ సినిమా త‌ర‌హాలో ఛేజ్‌.. కాల్పులు

పాల‌స్తీనా కార్య‌క‌ర్త‌లను తీసుకెళ్తున్న కారును ఓవ‌ర్‌టేక్ చేసి ఇద్ద‌రిపై తుటాలు వ‌ర్షం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఘ‌ట‌న‌ విధాత‌: ఇజ్రాయెల్‌లో హాలీవుడ్ యాక్షన్ సినిమా త‌ర‌హా ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్యంగా మారాయి. పాల‌స్తీనా, ఇజ్రాయెల్ ద‌ళాల ప‌ర‌స్ప‌ర దాడులు సినిమా యాక్ష‌న్ సీన్ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌నల‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. […]


విధాత‌: ఇజ్రాయెల్‌లో హాలీవుడ్ యాక్షన్ సినిమా త‌ర‌హా ఘ‌ట‌న‌లు నిత్య‌కృత్యంగా మారాయి. పాల‌స్తీనా, ఇజ్రాయెల్ ద‌ళాల ప‌ర‌స్ప‌ర దాడులు సినిమా యాక్ష‌న్ సీన్ల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఘ‌ట‌నల‌ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి.


గాజా సమీపంలోని నెట్‌వియోట్ నగరం శివారులో తాజాగా పాలస్తీనా కార్యకర్తలను కారులో తీసుకెళ్తున్నట్టు అనుమానిస్తూ ఒక ఇజ్రాయెల్ పోలీస్ బైక్‌పై వెంబ‌డిస్తూ తుపాకీతో కాల్పులు జ‌రిపాడు. ఇత‌డి సహోద్యోగులు అగంత‌కుల కారును ఓవర్‌టేక్ చేసి కారు ఆపి, అందులో ఉన్న ఇద్ద‌రిపై పోలీసులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు.


కారు అద్దాలు పగిలిన ముక్కలు రోడ్డుపై పడి ఉన్నాయి. ఖాళీ రహదారిపై జ‌రిగిన ఈ సన్నివేశం హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని త‌ల‌పించింది. ఇలా దక్షిణ ఇజ్రాయెల్‌లో పోలీసులు హమాస్ కార్యకర్తలను వేటాడుతున్నారు.