Allu Sneha | అర్హ బర్త్‌డే ట్రిప్‌లో స్నేహా రెడ్డి కొత్త అవతారం… ఫోన్స్ బ్యాన్ అంటే ఇలా చేశారేంటి?

Allu Sneha | మెగా డాటర్ కొణిదెల నిహారిక మాదిరిగా ఇప్పుడు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. సాధారణంగా చాలా సింపుల్‌గా, లోప్రొఫైల్‌లో ఉండే స్నేహ, ఈసారి మాత్రం పూర్తిగా ఛేంజ్ అయ్యింది.

Allu Sneha | మెగా డాటర్ కొణిదెల నిహారిక మాదిరిగా ఇప్పుడు అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. సాధారణంగా చాలా సింపుల్‌గా, లోప్రొఫైల్‌లో ఉండే స్నేహ, ఈసారి మాత్రం పూర్తిగా ఛేంజ్ అయ్యింది. కారణం తన కూతురు అర్హ 9వ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి అబుదాబి ట్రిప్‌కు వెళ్లారు. ఆ ట్రిప్ నుండి స్నేహ పోస్ట్ చేసిన రీల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

“నాలుగు రోజులు ఫోన్లు బ్యాన్… నిద్రకు నో చాన్స్!” – స్నేహా రెడ్డి

ట్రిప్ ప్రారంభంలో స్నేహ తన ఫ్రెండ్స్‌తో చాలా ఎనర్జీగా కనిపించింది. వీడియోలో స్నేహ .. “ఈ నాలుగు రోజులు ఫోన్లు బ్యాన్…! ఎవ్వరూ నిద్ర గురించి కూడా ఆలోచించకూడదు. ఈ ట్రిప్‌ని ఫెస్టివల్‌లా సెలబ్రేట్ చేద్దాం అని బాస్‌లా ఆదేశాలు ఇచ్చిన స్నేహ, చాలా యాక్టివ్ ఎనర్జీతో రీల్‌లో కనబడింది.

రివర్స్ అయిన రూల్స్… మొదట నిద్ర వద్దన్న గ్యాంగ్ చివరికి అన్నిచోట్ల నిద్రపోయింది!

అయితే రియాలిటీ మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరిగింది. స్నేహ తప్ప మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయి కనిపించారు. ఒకరు హోటల్ రూమ్‌లో దుప్పటి కప్పుకుని గాఢ నిద్రలో, ఇంకొకరు పార్క్ బెంచ్ మీదే నిద్ర‌పోయారు. మరోకరు కారు వెనుక సీట్లోనే నిద్రపోయారు. నిద్ర పోకూడదు అని అనుకున్న గ్యాంగ్… మొదటి రోజే నిద్రలో మునిగిపోవ‌డం వీడియోలో హాస్యాస్పదంగా మారింది.
ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లకు బాగా ఫన్నీగా, క్యూట్‌గా అనిపిస్తోంది.

స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో స్టార్?

ఇటీవల నిహారిక సోషల్ మీడియాలో రీల్స్‌తో యాక్టివ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు స్నేహా రెడ్డి కూడా అదే రూట్‌లోకి వచ్చిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ ఫన్ వీడియోతో స్నేహ పూర్తిగా కొత్త అవతారంలో కనిపిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. అర్హ బర్త్‌డేని సెలబ్రేట్ చేసేందుకు వెళ్లిన అబుదాబి ట్రిప్ స‌ర‌దాగా , మరీ ఎక్కువగా నవ్వులు పంచుతున్న వైరల్ కంటెంట్‌గా మారింది. కాగా, బ‌న్నీ ప్ర‌స్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్న క్ర‌మంలో అక్క‌డికి వెళ్ల‌లేద‌ని తెలుస్తుంది.

Latest News