12 ఏళ్ల లోపు పిల్లలపై ‘ఫైజర్‌’ ట్రయల్స్‌

12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్‌ ప్రారంభించింది అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ . క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అమెరికా, ఫిన్లాండ్‌, పోలాండ్‌, స్పెయిన్‌లో 4,500 మందికిపైగా పిల్లలను ఎంపిక చేసి ఈ ట్రయల్స్‌ నిర్వహించనుంది. ప్రస్తుతం 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఫైజర్‌ అభివృద్ధి చేసిన టీకాకు అమెరికా, యురోపియన్‌ యూనియన్‌లో 12 సంవత్సరాల పిల్లలకు వేసేందుకు అత్యవసర వినియోగం కింద […]

  • Publish Date - June 9, 2021 / 07:30 AM IST

12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్‌ ప్రారంభించింది అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ .

క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అమెరికా, ఫిన్లాండ్‌, పోలాండ్‌, స్పెయిన్‌లో 4,500 మందికిపైగా పిల్లలను ఎంపిక చేసి ఈ ట్రయల్స్‌ నిర్వహించనుంది.

ప్రస్తుతం 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న పిల్లలకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటికే ఫైజర్‌ అభివృద్ధి చేసిన టీకాకు అమెరికా, యురోపియన్‌ యూనియన్‌లో 12 సంవత్సరాల పిల్లలకు వేసేందుకు అత్యవసర వినియోగం కింద అనుమతి లభించింది.