లండన్: బ్రిటన్ ను అత్యధిక కాలం పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 (96) గురువారం స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్లో కన్నుమూశారు. బ్రిటను ఆమె ఏకంగా 70 ఏళ్ల పాటు మహారాణిగా వ్యవహరించారు. గురువారం మధ్యాహ్నం బల్మోరల్లో రాణి ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని బర్మింగ్హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
గురువారం ఉదయమే రాణి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులంతా స్కాటిష్ ఎస్టేట్ ఎబెర్డీన్ షైర్కు చేరుకోవడం మొదలు పెట్టారు. ఆమె కుమారుడు, వారసుడైన ప్రిన్స్ ఛార్లెస్, ఆయన భార్య కామిల్లా, మనుమడు ప్రిన్స్ విలియమ్ బల్మోరల్ చేరుకున్నారు.
వేసవి విడిది కోసం బల్మోరల్కు వచ్చిన ఎలిజబెత్-2 అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో రాణి వృద్ధాప్య సమస్యలతో ఎక్కువగా కదల్లేకపోతున్నారు. దీంతో ఆమె ప్రయాణాలను కూడా బాగా తగ్గించుకున్నారు.
బ్రిటన్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన రాణిగా.. ప్రపంచంలోనే సుదీర్ఘంగా పరిపాలించిన రెండో నాయకురాలిగా రాణి ఎలిజబెత్ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ నియామక వేడుకను కూడా బల్మోరల్ క్యాసల్‌లోనే నిర్వహించారు. లిజబెత్ కుమార్తె ప్రిన్సెస్ అన్నె కొన్ని రోజులుగా తల్లిని చూసుకుంటూ బల్మోరల్ క్యాసల్‌లోనే ఉండగా.