ఈ టీకాల‌ను నెల రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు.

విధాత,బ్ర‌సెల్స్‌: ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్ గురించి ఓ తీపి క‌బురు చెప్పింది యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఫైజ‌ర్ టీకాల‌ను నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో దాచ‌వ‌చ్చు అని స్ప‌ష్టం చేసింది. అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీ టీకాల‌ను అతిశీత‌ల ఉష్ణోగ్ర‌త‌ల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంద‌ని మొద‌ట్లో తెలిపారు. అయితే ఓపెన్ చేయ‌న‌టువంటి ఫైజ‌ర్ టీకా బుడ్డీల‌ను .. సాధార‌ణ ఫ్రిడ్జ్‌ల్లో నెల రోజుల పాటు పెట్టువ‌చ్చు అని యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న నియ‌మం […]

  • Publish Date - May 18, 2021 / 06:11 AM IST

విధాత,బ్ర‌సెల్స్‌: ఫైజ‌ర్ కంపెనీ వ్యాక్సిన్ గురించి ఓ తీపి క‌బురు చెప్పింది యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఫైజ‌ర్ టీకాల‌ను నెల రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో దాచ‌వ‌చ్చు అని స్ప‌ష్టం చేసింది. అమెరికాకు చెందిన ఫైజ‌ర్ కంపెనీ టీకాల‌ను అతిశీత‌ల ఉష్ణోగ్ర‌త‌ల్లో స్టోర్ చేయాల్సి ఉంటుంద‌ని మొద‌ట్లో తెలిపారు. అయితే ఓపెన్ చేయ‌న‌టువంటి ఫైజ‌ర్ టీకా బుడ్డీల‌ను .. సాధార‌ణ ఫ్రిడ్జ్‌ల్లో నెల రోజుల పాటు పెట్టువ‌చ్చు అని యురోపియ‌న్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది. ప్ర‌స్తుతం ఉన్న నియ‌మం ప్ర‌కారం.. ఫైజ‌ర్ టీకాల‌ను ఫ్రిడ్జ్‌లో కేవ‌లం అయిదు రోజులు మాత్ర‌మే ఉంచాలి. అయితే వ్యాక్సిన్ నిల్వ చేసే స‌మ‌యాన్ని పెంచ‌డం వ‌ల్ల‌.. ఆ టీకా స‌ర‌ఫ‌రా కూడా వేగం పుంజుకుంటుంద‌ని ఈయూ అభిప్రాయ‌ప‌డింది.

వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డం, ఆ త‌ర్వాత వాటిని అతిశీత‌ల ఉష్ణోగ్ర‌త‌ల్లో నిల్వ‌ చేయ‌డం కొంత క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని. ఫైజ‌ర్ టీకాల్లో ఉన్న లోపం అదే. అయితే ఇప్పుడు ఆ స‌మ‌స్య తీరిన‌ట్లు అవుతుంది. ఫైజ‌ర్ స్టోరేజీకి ఫ్రీజ‌ర్లు అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో.. ఆ టీకాల‌ను కొన్ని దేశాలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు త‌లెత్తాయి. ఇప్పుడు ఆ స‌మ‌స్యలు తీర‌నున్నాయి. మొద‌ట‌ల్లో మైన‌స్ 80 డిగ్రీల సెంటిగ్రేడ్ వ‌ద్ద నిల్వ చేయాల‌ని, ఆ తర్వాత మైన‌స్ 25సీ ఉష్ణోగ్ర‌త మ‌ధ్య నిల్వ చేయాల‌ని అమెరికా కంపెనీ పేర్కొన్న‌ది. ఫైజ‌ర్ టీకాల‌ను 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఇచ్చేందుకు ఇటీవ‌ల కెన‌డా ఆమోదించింది. ఇండియాకు ఫైజ‌ర్ కంపెనీ 5 కోట్ల టీకాల‌ను అమ్మేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ది.