King Cobra | ఈ నాగుపాము వెరీ స్పెష‌ల్..! ఏనుగును కూడా చంప‌గ‌ల‌దట‌..!!

King Cobra | స‌రీసృపాల్లో అత్యంత భ‌యంక‌ర‌మైన‌వి పాములు( Snakes ). ఇందులో చాలా వ‌ర‌కు విష‌పూరిత‌మైన‌వే( Venomous Snake ) ఉంటాయి. ఇవి కాటేస్తే ప్రాణాలు క్ష‌ణాల్లో గాల్లో క‌లిసిపోతాయి. మ‌న‌షుల‌ను పాములు కాటేసి చంప‌డం చూశాం. కానీ ఈ నాగుపాము( King Cobra ) మ‌న‌షులనే కాదు.. ఏనుగు( Elephant )ల‌ను కూడా చంపేయ‌గ‌ల‌ద‌ట‌. మ‌రి ఆ నాగుపాము గురించి తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.

King Cobra | ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైర‌ల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే గుండెల్లో ద‌డ‌పుట్టక త‌ప్ప‌దు. ఎందుకంటే.. ఓ భారీ నాగుపాము( King Cobra )ను ఓ యువ‌కుడు త‌న చేతుల్లో పట్టుకుని.. ఆటాడిస్తున్నాడు. ఈ నాగుపాము మ‌లేషియన్ కింగ్ కోబ్రా( Malaysian King Cobra ) అట‌. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత పొడ‌వైన‌ది.. అత్యంత విష‌పూరిత‌మైన‌ద‌ట‌.

ఈ భారీ నాగుపాము వీడియోను అమేజింగ్ నేచ‌ర్ అనే ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీని పేరు మ‌లేషియ‌న్ కింగ్ కోబ్రా(Malaysian King Cobra ). ఈ భూమ్మీద‌నే ఇది అత్యంత పొడ‌వైన విషపూరిత‌మైన పాము( Longest Venomous Snake ). మ‌గ జాతికి చెందిన ఈ మ‌లేషియ‌న్ కింగ్ కోబ్రా.. 17 నుంచి 18 ఫీట్ల పొడ‌వు ఉంటుంద‌ని పేర్కొన్నారు.

పాముల రాజు అని నామ‌క‌ర‌ణం..

ఈ పాము ప్ర‌త్యేక‌త ఏంటంటే.. అత్యంత తెలివైన‌ది కూడా. వేటాడే టెక్నిక్స్ కూడా దీని సొంతమ‌ట‌. ఇత‌ర పాముల‌ను కూడా అమాంతం తినేస్తుంద‌ట‌. అందుకే దీన్ని పాముల రాజు( Kings of Snake ) అని పిలుస్తార‌ట‌.

ఏనుగును కూడా చంపేయ‌గ‌ల‌ద‌ట‌..!

జంతు నిపుణుల ప్ర‌కారం.. మ‌లేషియ‌న్ కింగ్ కోబ్రాకు ఏనుగుల‌ను చంపే సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంద‌ట‌. అంటే ఈ పాము ఏనుగు( Elephant )ను కాటేస్తే.. కొన్ని గంట‌ల్లో ఏనుగు ప్రాణాలు విడుస్తుంద‌ట‌. అయితే మ‌న‌షుల‌పై అంతా ఈజీగా దాడి చేయ‌ద‌ట‌. త‌న‌కు ముప్పు ఉంద‌ని భావించిన‌ప్పుడు మాత్ర‌మే పాము కాటేస్తుంద‌ట‌. మ‌లేషియ‌న్ కింగ్ కోబ్రా ప్ర‌ధానంగా పెనిస్యూలార్, ఈస్ట్ మలేషియాలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.