Elephant Performing Aarti To Ganesha : గణేషుడి విగ్రహానికి ఏనుగు హారతి..వైరల్ వీడియో

గజాననుడికి సాక్షాత్తూ గజరాజు హారతి ఇస్తున్న అద్భుత దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది. తొండంతో హారతి పల్లెం పట్టుకుని వినాయకుడికి భక్తితో నీరాజనం ఇస్తున్న వీడియో భక్తులను ఆకట్టుకుంటోంది.

Elephant performing aarti to Ganesha

విధాత : గజాననుడు వినాయకుడికి ఏనుగు హారతి ఇచ్చిన వీడియో వైరల్ గా మారింది. వినాయకుడికి ప్రతిరూపంగా భావించే ఏనుగు తన తొండంతో హారతి పల్లాన్ని పట్టుకుని విగ్రహం చుట్టు తిప్పుతూ హారతినిచ్చిన అద్భత దృశ్యం చూసి తీరాల్సిందే.

భారత్ లోని దేవాలయాలలో ఏనుగులు పూజాధికాల్లో, ఉత్సవాల్లో పాల్గొనడం అనాది నుంచి వస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను వినియోగిస్తుంటారు. ఏనుగులను వినాయకుడి ప్రతిరూపంగా..శ్రీ లక్ష్మి, మహావిష్ణువుల సేవలు నిర్వహించే జంతువుగా భావిస్తూ పూజిస్తుంటారు. ఇక వినాయకుడి తల ఏనుగు శిరస్సు కావడంతో ఏనుగే వినాయకుడి..వినాయకుడే ఏనుగు అన్న భావనతో భక్తులు కొలుస్తారు.

ఓ ఆలయంలో ఏనుగు తన తొండంతో హారతి పల్లెం పట్టుకుని భక్తులు ఆలయ పూజారుల మధ్య గణేషుడి విగ్రహానికి నేర్పుగా హారతినిచ్చింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తజనం జై గణేషా..జైజై గజానన అంటూ భక్తీ పారవశ్యంతో నినదించారు. ఏనుగు పూజ..హారతి దృశ్యాలను భక్తులు తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకోవడంలో పోటీ పడ్డారు. ఏనుగు రూపమైన వినాయకుడికి ఏనుగు హారతినిస్తున్న ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే దేశంలోని ఏ ప్రాంతంలోని వినాయక దేవాలయంలో ఈ ఘటన జరిగిందన్న సమాచారంపై వివరాలు లభించలేదు.

ఇవి కూడా చదవండి :

Tollywood Stars | మ‌రి కొద్ది రోజుల‌లో ముగియ‌నున్న 2025 .. ఈ ఏడాది తల్లిదండ్రులైన టాలీవుడ్ స్టార్స్ వీరే..
MLA Ram Kadam | నీటి కొర‌త‌కు శాశ్వ‌త ప‌రిష్కారం.. నాలుగేండ్ల త‌ర్వాత జుట్టు క‌త్తిరించుకున్న ఎమ్మెల్యే

Latest News