MLA Ram Kadam | ఈ దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక చోట సాగు, తాగు నీటి సమస్య ఉంటూనే ఉంటుంది. ఎన్నికల వేళ సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రతిజ్ఞలు చేస్తుంటారు.. హామీలు గుప్పిస్తుంటారు. ఆ హామీలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలిపోతాయి. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నెరవేర్చారు. తన నియోజకవర్గంలో నీటి సమస్యను తీర్చే వరకు జుట్టు కత్తిరించుకోనని ప్రతిజ్ఞ చేసిన ఆయన ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. నీటి కొరతకు శాశ్వతం పరిష్కారం చూపించారు. ఇక నాలుగేండ్ల తర్వాత జుట్టు కత్తిరించుకున్నారు సదరు ఎమ్మెల్యే.
మహారాష్ట్రలోని ఘట్‌కోపర్ వెస్ట్ నియోజకవర్గంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. అయితే నాలుగేండ్ల క్రితం ఎన్నికల సమయంలో బీజేపీ తరపున బరిలోకి దిగిన రామ్ కదమ్.. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే వరకు తాను క్షవరం చేయించుకోనని ప్రతినబూనాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కదమ్ కటింగ్ చేయించుకోలేదు. ఇటీవల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో గురువారం ఎమ్మెల్యే రామ్ కదమ్ జుట్టు కత్తిరించుకున్నారు.
నియోజకవర్గంలో నీటి సమస్యను పూర్తిగా నిర్మూలించడానికి రెండు కోట్ల లీటర్లకు పైగా నీటిని నిల్వ చేయగల ట్యాంకులు నిర్మిస్తున్నట్లు రామ్ కదమ్ తెలిపారు. భండూప్ ప్రాంతం నుంచి నీటి లైన్‌ను కూడా అనుసంధానించామన్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలకు అన్ని రకాల ప్రాథమిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Nidhhi Agerwal | నిధి అందాల విందు.. మెస్మరైజింగ్ లుక్‌లో నిధి అగర్వాల్
VB G Ram G | పనిదినాల డిమాండ్ తొలగిస్తూ ఉనికిలోకి ‘జీ రామ్ జీ’
