విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ లోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణికి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
ఇవి కూడా చదవండి :
National Masters Games | నేషనల్ మాస్టర్స్ గేమ్స్ 2026లో మూడు స్వర్ణాలు సాధించిన భద్రాచలం పెన్షనర్ గాలి రామ్మోహనరావు
MAG7 Job Cuts | ఏఐ ఎఫెక్ట్.. రానున్న రెండేళ్లలో లక్షల్లో ఉద్యోగులను తొలగించనున్న బడా టెక్ కంపెనీలు
