Kadiyam Srihari : కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు

కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ షాక్! రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు. సుప్రీంకోర్టు గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చనున్న స్పీకర్.

Kadiyam Srihari

విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ కు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు. రేపు బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ కేపీ వివేకానంద వాదనలు
సైతం స్పీకర్ ప్రసాద్ నమోదు చేయనున్నారు. పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ ను సుప్రీంకోర్టు వివరణ కోరింది. విచారణ పూర్తి చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించింది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో భాగంగా అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యదయ్యల పిటిషన్లను విచారించిన స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు పార్టీలు మారారని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ ముగిసింది. కానీ తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ అనర్హత పిటిషన్ల విచారణ పెండింగ్ లో ఉంది. దానం అనర్హత పిటిషన్ విచారణ ప్రక్రియను స్పీకర్ ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు.

ఇవి కూడా చదవండి :

Ram Charan-Upasana | ట్విన్ పేరెంట్స్ క్లబ్‌లో చేరిన రామ్ చరణ్ – ఉపాసన.. ఇంత‌క‌ముందు ఎవ‌రెవరు ఉన్నారు..!
Expensive Number Plate : ఫ్యాన్సీ నంబర్ క్రేజ్…కారు నంబర్ కు రూ.2.08కోట్లు !

Latest News