విధాత, హైదరాబాద్ : భవిష్యత్తు లో చదువుకున్న యువతకు ఉపాధి లభించడం గగనంగా ఉంటుందని, మరింత దుర్భరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న 12-15 సంవత్సరాల్లో పోటీ పెరిగి 400 మిలియన్ల ఉద్యోగాల కోసం 1.2 బిలియన్ల యువత పోటీపడుతుందని ఆయన అన్నారు.
దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అజయ్ బంగా మాట్లాడుతూ, రానున్న 12-15 సంవత్సరాల్లో ఇప్పుడు చదవుకుంటున్న విద్యార్థులకు 18 సంవత్సరాల వయస్సు వస్తుందని, అప్పటికల్లా మార్కెట్ లో 400 మిలియన్ల ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఏఐ తో పాటు ఇతర సాంకేతికతల కారణంగా ఐటీ రంగంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రభుత్వాలు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు బిజినెస్ –ప్రెండ్లీ విధానాలు తీసుకువస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు పుట్టుకువస్తాయన్నారు. సింగపూర్ దేశంలో ప్రభుత్వ విధానాల మూలంగా ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని, ప్రైవేటు సంస్థలకు ఆర్థిక వనరులు అందేలా చూడాలన్నారు. ప్రత్యేకించి చిన్న, మధ్య తరహా కంపెనీలను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని ఆయన వివరించారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వడం అక్కడ రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉందన్నారు. ఏఐ రాక మూలంగా రైతులకు, ఆరోగ్య సేవకులకు, విద్యా రంగంలో పనిచేసే వారికి ఉపయోగకరంగా ఉంటుందని, మరింత మెరుగ్గా పనిచేస్తారన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, ప్రాథమిక ఆరోగ్య విభాగం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెడుతోందన్నారు. నేను భారత దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పుట్టి, పెరిగాను, తన తండ్రి ఆర్మీఆఫీసర్ గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తను గ్రామీణ ప్రాంతంలో కొద్ది రోజులు ఉన్నానని వివరించారు. రైతుల నుంచి పాలు సేకరించి, విక్రయించేవాళ్లమన్నారు. కొద్ది సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న రైతులు తమ భూములు, పశు సంపదను విక్రయించి పట్టణ బాట పట్టడంతో వారి సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. ప్రస్తుతం వారంతా పట్టణ ప్రాంతాల్లో పేదలుగా మారిపోయారని విచారం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి పండిన పంటలకు తగిన గిట్టుబాటు, మార్కెట్ సౌకర్యం కల్పిస్తే లబ్ధి పొందుతారన్నారు. పర్యాటకంతో పాటు ఉత్పాదక రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Delhi Rains | ఢిల్లీలో వర్షం.. కశ్మీర్‌లో మంచు.. ఉత్తరాదిలో అకస్మాత్తిగా మారిన వాతావరణం
Tamannaah Bhatia | ఏం డ్రెస్ రా బాబు.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.. తమన్నా లేటెస్ట్ ఫొటోస్
