విధాత : పశ్చమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గ్యాస్, చమురు ధరలు పెరుగకుండా కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మాప్రయోగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయిల్, గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకే ఎస్మా ప్రయోగించినట్లుగా కేంద్రం పేర్కొంది.
డొమెస్టిక్ గ్యాస్, ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే ఆయిల్, గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు తగ్గకుండా పెట్రోలియం శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఎల్ పీజీ ఉత్పత్తి పెంచేలా ఆయిల్ రిఫైనర్లకు కేంద్రం ఆదేశాలిచ్చింది.
మన దేశంలో ఏటా 31.3 మిలియన్ టన్నుల వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 62 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకుంటుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
మరోవైపు దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఎల్ పీజీ కొరత నేపథ్యంలో ముంబైలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. బెంగుళూరు, ఢిల్లీలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగుతుంది. వంట గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాల్సి వస్తుండటంతో తమ వ్యాపారం దెబ్బతింటుందని నిర్వాహకులు వాపోతున్నారు. ఇంకోవైపు ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ విక్రయాలు ఊపందుకుంటున్నాయన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
దీంతో కేంద్రం ఎల్బీపీజీ బ్లాక్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక, వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
ఇవి కూడా చదవండి :
భారత క్రికెట్ జట్టు ఎందుకు బ్లూ కలర్ జెర్సీనే ధరిస్తుందో తెలుసా?
Cheetah Project| కునో పార్కులో 5 చీతాలకు జన్మనిచ్చిన జ్వాలా
